Telugu Indian Idol: బాలయ్య చిలిపి అల్లరి…నువ్వు మామూలుడివి కాదయ్యో..!

నందమూరి బాలయ్య..ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు. సీరియస్ గా,టెన్షన్ గా ఉన్న వాళ్లను సైతం ఇట్టే నవ్వించేస్తారు. అలా అందరి వల్ల కాదు. కానీ, ఆ పని మన బాలయ్యకు వెన్నతో పెట్టిన విధ్య. అందరు బాగుండాలి..అందరిలో మనం ఉండాలి..ఇదే బాలయ్య కాన్సెప్ట్. తొడ కొట్టి శపధాలు చెయ్యాలి అన్న, మీసం మెలివేసి డైలాగ్ లు చెప్పాలి అన్న..60ప్లస్ లోను 25 కుర్రాడిలా స్టెప్పులు వేయ్యాలి అన్న..బాలయ్యకే సాధ్యం . బాలయ్య మల్టీ టాలెంటెడ్ అని అంటుంటారు అంతా..అది నిజమే అని ఆయన చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నారు.

కాగా, రీసెంట్ గా మరోసారి తనదైన స్టైల్ లో దాని ఆహా సాక్షిగా మళ్లీ ప్రూవ్ చేశాడు. మనకు తెలిసిందే, ఆహ తో బాలయ్య అన్ స్టాపబుల్ సంబంధం ఉంది. కెరీర్ లో అప్పటి వరకు సినిమాల్లో నటించిన బాలయ్య..ఫస్ట్ టైం హోస్ట్ గా అవతారం ఎత్తి..జనాలను పిచ్చి పిచ్చిగా పిచ్చెక్కించే విధంగా నవ్వించారు. ఈ షో వల్లనే ఆహా ఫాలోవర్స్ పెరిగారు అనడంలో సందేహం లేదు. మరికొద్ది రోజుల్లోనే ఈ షో కి సంబంధించిన సీజన్ 2 ప్రారంభం కానుంది.

కాగా, ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో ఫైనల్ స్టేజీకి చేరుకుంది. ఇక ఈ తెలుగు ఇండియన్ ఐడల్ సెమీ ఫైనల్స్ కి చీఫ్ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ హజరయ్యారు. షో లో ఆయన చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. కుర్రాడిలా మారిపోయిన బాలయ్య..జడ్జీలు, కంటెస్టెంట్లతో సరదాగా గడిపారు . ఈ క్రమంలోనే బాలయ్య అక్కడున్న కంటెస్టెంట్ల పై తనదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తూ,,వాళ్ల టెన్షన్ పోగొట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఈ క్రమంలోనే బాలయ్య మాట్లాడుతూ ..”అదేంటి..అందరు కొత్త కంటెస్టెంట్లని చెప్పారు. మరీ పూజ హెగ్డేను పిలిచారే”..అంటూ అక్కడున్న లేడీ కంటెస్టెంట్ ను చూసి సరదాగా మాట్లాడారు. అంతేకాదు .. ‘మేకతోక’ పద్యం ఆ అమ్మాయితో కలిసి అందరి ముందు తన దైన స్టైల్ లో చెప్పారు. దీంతో జడ్జీలు సైతం షాక్ అయ్యారు. బాలయ్య బాబు మల్టీ టాలెంటెడ్ అంటూ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0TbmVBVmfZyaFsVzbpDbYVvVFoVBq8zgoeSYu9HBB5RDx6nQGoBq41Air2pQrThsdl&id=100044015294919

Share post:

Popular