ట్రెండ్ సెట్ చేస్తున్న నటసింహం.. ఇప్పుడు ఎక్కడ చూసినా బాలయ్య జపమే..!

బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారత దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించింది. భారతదేశం వెలుపల కొన్ని దేశాల్లో కూడా బాలయ్య తన సత్తా చాటాడు. అయితే ఇప్పుడు ఈ అఖండ సినిమా ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ అద్భుతమైన సినిమా తర్వాత ఎక్కడ చూసినా బాలయ్య జపమే వినిపిస్తోంది. సోషల్ మీడియా తీసుకున్నా లేక బయట చూసుకున్నా జై బాలయ్య అనే నినాదాలు ప్రతి సినీ ప్రేమికుడి నోట వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని రాయ‌చూర్‌, బ‌ళ్లారి, మాన్వి, సింధ‌నూర్, చిక్‌మ‌గ్‌ళూర్ త‌దిత‌ర ప్రాంతాల్లోని వీధి తెరల్లో అఖండ మూవీ ప్రతి రోజూ ప్రదర్శింపబడుతోంది. ఒక్క అఖండ సినిమా మాత్రమే కాదు బాలయ్య ఇంతకుముందు నటించిన సూపర్ హిట్ మూవీస్‌ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి వంటివి కూడా ప్రదర్శనలు వేస్తున్నారు.

సాధారణంగా ఈ రోజుల్లో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గింది. దీనికి కారణం ఓటీటీ యాప్స్, యూట్యూబ్ వంటి ఫ్రీ వీడియో స్ట్రీమింగ్ యాప్స్ అని చెప్పవచ్చు. సినిమాలు చూసేందుకు చాలా తక్కువ మందే ఈ రోజుల్లో గడపదాటుతున్నారు. అలాంటిది బాలకృష్ణ సినిమాలను స్పెషల్‌గా వీధి తెరల్లో వేసి ప్రదర్శిస్తున్నారంటే అది గొప్ప విషయమనే చెప్పొచ్చు. పాత కాలంలో ఇలా వీధుల్లో సినిమాలు ప్రదర్శించే వారు. మళ్లీ అలాంటి ట్రెండ్‌ను బాలయ్య సెట్ చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు.

Share post:

Popular