కొన్ని విష‌యాలు అంతే.. వైసీపీలో గ‌ప్ చుప్ రాజ‌కీయం..!

రాష్ట్ర వైసీపీలో కొన్ని విష‌యాలు గ‌ప్‌చుప్‌గా సాగుతున్నాయి. వాటిని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. `అదంతే.. గ‌ప్ చుప్‌` అంటూ.. కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం.. వారంతా అధిష్టానానికి అత్యంత స‌మీపంలో ఉండ‌డంతో ఆయ‌న‌కు అత్యంత ఆత్మీయులుగా పేరు తెచ్చుకోవ‌డ‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉదా హ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌.. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర ణ‌లో ప‌ద‌విని కోల్పోయారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న దూకుడు ఎక్క‌డా త‌గ్గ‌లేదు.

అదేవిధంగా ప్ర‌కాశంజిల్లా ఒంగోలు కుచెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ప‌ద‌విని కోల్పో యారు. అయినా.. ఆయ‌నే అన్నీ అయి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, విశాఖ జిల్లాకు చెందిన భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ప‌ద‌వి పోయింది. అయినా.. కూడా ఈయ‌న దూకుడు త‌గ్గించ‌లేదు. ఇలా ఈ ముగ్గురు కూడా త‌మ త‌మ జిల్లాల్లో పైచేయిగా దూసుకుపోతున్నారు. ఏ ప‌ని అయినా.. వారే క‌నిపిస్తున్నారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్నారు.

అంతేకాదు.. ఇప్పుడు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలోనూ.. ముందున్నారు. ఫ‌లితంగా వారి చుట్టూతానే.. వైసీపీ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. పైగా.. వీరు పార్టీలోనూ.. ముందున్నారు. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి వెలంప‌ల్లికే ప్రాధాన్యం ఇచ్చారు. వాస్తవానికి ఇక్క‌డికి కొత్త‌గా బాధ్య‌త లు చేప‌ట్టిన మంత్రి ఒక‌రు దుర్గ గుడి ద‌ర్శ‌నానికి వ‌చ్చారు. అయితే.. వెలంప‌ల్లి కి ముందు ప్రాధాన్యం ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. దీనిపై ఎవ‌రూ నోరు విప్ప‌లేదు.

అదేవిధంగా ఒంగోలులో ఇటీవ‌ల జ‌రిగిన గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో మ‌హిళా మంత్రి ఒక‌రు పాల్గొన్నా రు. అయితే.. ఆ మంత్రి క‌న్నా.. ఎక్కువ‌గా అధికారులు బాలినేని ప్రాధాన్యం ఇవ్వ‌డం.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. ఇక‌, విశాఖ‌లోనూ.. ఇటీవ‌ల జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అవంతి ఏకంగా మంత్రి ముందే.. పోలీసుల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు.. ఇదేంటి? అని ప్ర‌శ్నిస్తే.. సీనియ‌ర్లు.. మాత్రం .. `ష్‌.. గ‌ప్‌చుప్‌` అది అంతే అంటున్నారు. ఇదీ.. సంగ‌తి!!

Share post:

Popular