అరెరెరె..అల్లు అర్హా పై ట్రోలింగ్..ఏం మనుషులయ్యా మీరు..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సమాజం మరింత దారుణంగా తయారైంది. అస్సలు జాలి, దయ లాంటి మర్చిపోయిన్నట్లు ఉన్నారు కొందరు జనాలు. చేతిలో ఫోన్ ఉంది..కావాల్సిన అన్ని సోషల్ మీడియా అకౌంట్ లు ఉన్నాయి. నోటికి వచ్చింది మాట్లాడేస్తే సరిపోతుందా..కాస్త బుర్ర వాడరా..అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దానికి బిగ్గెస్ట్ రీజన్..తమ అభిమాన హీరో కూతురిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడమే. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్ కి ఘాటు కౌంటర్లు ఇస్తున్నారు.

అస్సలు ఏమైందంటే..అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా..ఈ మధ్య ఓ యూట్యూబ్ ఇంటర్వ్యుల్లో కనిపించింది. తన తాతగారు చంద్రశేఖర్ స్నేహారెడ్డి తండ్రి ఇంటికి వెళ్లిన అర్హ పాప..వాల్ల తాతను ఇంటర్వ్యూ చేస్తున్న ఓ యూట్యూబ్ ఛానల్ వీడియో లో దర్శనమిచ్చింది. అనుకోని విధంగా తాతతో ఉంటర్వ్యుల్లో పాల్గొంది అర్హా. ఇంటర్వ్యు మధ్యలోకి వచ్చిన అర్హాని…యాంకర్ మట్లాడిస్తూ..హాయ్ పాప..నీపేరు ఏంటి అని జనరల్ గా అడిగాడు. దీంతో అల్లు అర్హా..స్వీట్ గా..క్యూట్ గా..తన ముద్దు ముద్దు మాటలతో..”అల్లు అర్హా రెడ్డి” అంటూ చెప్పుకొచ్చింది.

అంతే..బాబోయ్..ఇక చూడండి చిన్న పాప అని కూడా చూడకుండా ఆమె పై ట్రోలింగ్ స్టార్ట్ చేసారు ట్రోలర్స్. అంతేనా..మధ్యలోకి స్నేహా రెడ్డిని, బన్ని ని లాకొస్తూ..వాట్ బన్నీ..ఇలానేనా పిల్లలిని పెంచేది అంటూ పరోక్ష కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ..”మనం కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం. మన పిల్ల పేరు పక్కన రెడ్డి అంటూ పెట్టడం ఏంటి”,,అంటూ మండిపడుతున్నారు . దీనిపై అల్లు ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతూ..చిన్న పాప..అయినా ఇంకా క్యాస్టింగ్ ఫీలింగ్ అంటూ పిల్లల మనసుల్లో కూడా ముద్ర వేసి..నెక్స్ట్ జనరేషన్ ని కూడా పాడు చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇలాంటివి ఆపండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Share post:

Popular