ఎన్టీఆర్ శ‌త జ‌యంతి: అన్న‌గారి చ‌రిత్ర అభివృద్ధి సిరాతో..!

దివంగ‌త మ‌హా న‌టుడు.. విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు.. ఆంధ్రుల అన్న‌గారు.. ఎన్టీఆర్ జ‌న్మించి.. నేటికి 99 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని టీడీపీ ఆధ్వ‌ర్యంలో.. ఈ ఏడాది ఎన్టీ ఆర్ శ‌త‌జ‌యంతిని నిర్వ‌హిస్తున్నారు. మొత్తం ఏడాది పాటు.. అన్న‌గారిని స్మ‌రించుకుంటూ.. రాష్ట్రంలో నే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా ఏడాది పాటు శ‌త జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో అన్న‌గారి చ‌రిత్ర‌లో అభివృద్ధి అంకాన్ని ప‌రిశీలిద్దాం..

అన్న‌గారు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస‌రికి.. రాష్ట్రంలో కేవ‌లం కాంగ్రెస్ ఆధిప‌త్య‌మే ఉండేది. అంతేకాదు.. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని కాంగ్రెస్ ఢిల్లీ పెద్ద‌ల ముందు మోక‌రిల్లేలా చేసి.. తెలుగు ప్ర‌జ‌ల‌ను అవ‌మా నిస్తున్నార‌ని.. భావించిన అన్న‌గారు.. నూత‌న పార్టీని స్థాపించారు. తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని.. న‌లుదిశ‌గా చాటే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో తొలుత అన్న‌గారు.. పల్లెల్లో పాతుకుపోయిన పటేల్‌ పట్వారీ వ్యవస్థను ఒక్క కలంపోటుతో రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్‌కే ద‌క్కుతుంది.

ఇక‌, అప్ప‌టి వ‌ర‌కు ఉన్న తాలూకాల స్థానంలో మండలాలను ఏర్పాటు చేసి… ప్రభుత్వాన్ని ప్రజల చెంత కు చేర్చిన చరిత్ర అన్న‌గారికే సొంత‌మ‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. పాలనలో తిరుగులేని సంస్కరణ లు చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అనే చెప్పాలి. సంక్షేమానికి సారథిగా నిలిచి పార్టీ పెట్టడం ఒక చరి త్ర అయితే.. జీవించినంత కాలం.. ఎక్కడా అవినీతి అన్న‌మాట‌కు తావులేకుండా ఎన్టీఆర్ దూసుకుపో యారు. ముఖ్యంగా.. పేద‌ల‌కు ఏదైనా చేయాల‌నే త‌లంపుతో ఆయ‌న వేసిన అడుగులు న‌భూతో న‌భ‌వి ష్య‌తి.

మండల వ్యవస్థతో ప్రజలకు చేరువైన ప్రభుత్వం.. పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దుతో సంచలనం సృష్టించింది. ఇక‌, పేదలకు కూడు.. గూడు.. గుడ్డ..రూ.2కే కిలో బియ్యం, జనతా వ‌స్త్రాలు.. పక్కా ఇళ్లు ప్రారంభించి.. తెలుగు వారింటి అన్న‌గారిగా ఎన్టీఆరే చిర‌కాల కీర్తిని గ‌డించారు. అంతేకాదు.. మండల, జిల్లా ప్రజాపరిషత్‌ చైర్మన్ల ఎన్నికల్లో తొలిసారి రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. ఇలా.. ఎన్టీఆర్ .. త‌న రాజ‌కీయ జీవితంలో అడుగులు వేసిన తీరు.. మ‌రెన్నో త‌రాల‌కు ఆద‌ర్శ‌మ‌నే చెప్పాలి.

Share post:

Popular