పవన్ కొడుకు కొణిదెల వారసుడు కాదా..? రేణు మైండ్ బ్లాకింగ్ షాక్..!!

గత కొన్ని రోజుల నుండి..సోషల్ మీడియా మెగా ఫ్యాన్స్ VS అల్లు ఫ్యాన్స్ అంటూ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయవాడలో జరిగిన మెగా ఆత్మీయ సమావేశంలో బన్నీ ఫోటో లేకుండా కేవలం మెగా హీరో వారసుల ఫోటోలు మాత్రమే కనిపించడంతో..బన్నీ కి మెగా ట్యాగ్ తీసేశారని ఓ వార్త తెగ వైరల్ గా మారింది. ఆ తరువాత జరిగిన మ్యాటర్ అంతా మానకు తెలిసిందే.

బన్నీ ఫ్యాన్స్ దెబ్బకి వాళ్ళు దిగొచ్చి..సారీ కూడా చెప్పారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మ్యాటర్ కూల్ అయ్యింది..నో ప్రాబ్లమ్ ..ఆల్ హ్యాపీస్ అనుకుంటున్న టైంకి మరో బిగ్ బాంబ్ పేల్చింది రేణు దేశాయ్. మనకు తెలిసిందే పవన్ రేణు ప్రేమించి.. పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఏవో రీజన్స్ తో విడాకులు తీసుకున్నారు. విడిపోయిన పిల్లల బాధ్యతలను పవన్ చూసుకుంటూ వస్తున్నాడు .

ఈ క్రమంలోనే అకిరా గ్రాడ్యూయేషన్ డే కి వెళ్లి అందరికి షాక్ ఇచ్చి..కొడుకు కూతురు మాజీ భార్యని సంతోషపరిచాడు. దీని పై కొందరు ట్రోల్ చేసినా..పవన్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ దే..భార్య భర్తల గొడవలకి పిల్లలు ఏం చేస్తారు..అంటూ పవన్ ని వెనకేసుకుని వచ్చారు. అయితే, ఆ ఈవెంట్ లో పవన్ కొడుకు అకీరా..తనలోని టాలెంట్ ను బయట పెడుతూ..RRR మూవీలోని ఫేమస్ సాంగ్ దోస్తీ ని ప్లే చేసి..శభాష్ అనిపించుకున్నాడు . ఇక ఆ సమయంలో స్క్రీన్ పై “అకీరానందన్ దేశాయ్” అంటూ డిస్ప్లే చేసారు. దీంతో మెగా ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. పవన్ కొడుకు పేరు అకీరానందన్ కొణిదెల అని ఉండాలి కానీ..ఇలా అమ్మ పేరు రావడం బాగోలేదు అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు రేణు దేశాయ్ ఇలా చేసి మెగా ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది అంటూ ఫైర్ అవుతున్నారు. మరి దీని పై రేణు ఎలా స్పందిస్తుందో చూడాలి..?

Share post:

Popular