పవన్ కళ్యాణ్.. ప్రభాస్ కి సారీ చెప్పాలసిందే..అభిమానులు రచ్చ రచ్చ..?

ఇండస్ట్రీలో ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు. వాళ్ళ అభిమాన హీరోని ఇంట్లో అమ్మ నాన్న ల కంటే ఎక్కువుగా ఇష్టపడతారు. వాళ్ళ కోసం ఏమైన చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పటివరకు మనం అలా హీరోల కోసం..తమ ప్రాణలను సైతం ఇచ్చిన అభిమానులని చాలా మందినే చూశాం. అయితే, రాను రాను కొందరి హీరోల అభిమానులు మరి హద్దులు దాటేస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటే అందరు ఎప్పుడు కాచుకుని కూర్చుంటారు. ఫ్యాన్స్ తప్పు చేసినా..తప్పు చేయకపోయినా..కావాలనే టార్గెట్ చేసి మరి..తిడుతుంటారు.

ఇక తాజాగా మళ్ళీ అలాంటి మ్యాటర్ నే ఇంటర్నెట్ లో హీట్ పుట్టిస్తుంది. మనకు తెలిసిందే, గతంలో ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ మధ్య జరిగిన లొల్లి..హద్దులు దాటి కొట్టుకునే వరకు వెళ్లి ..చివరికి పోలీసుల వల్ల కూడా కాకపోవడంతో ఆ నియోజకవర్గంలో ఏకంగా 144 సెక్షన్ విధించి..రంగలోకి పవన్, ప్రభాస్ నే దిగ్గి..అభిమానులను కంట్రోల్ చేయాల్సిన పరిస్ధితి వచ్చింది. ఇక ఆ తరువాతా వీళ్ల మధ్య పెద్ద చెప్పుకోతగిన గొడవలు లేకపోయినా..రీసెంట్ గా మళ్ళీ వార్ స్టార్ట్ అయ్యింది.

మనకు తెలిసిందే ట్విట్టర్ లో ‘స్పేస్’ అనే ఓ సరికొత్త ఫ్యూచర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రజెంట్ యువతను ఆ ఫ్యూచర్ బాగా ఆకట్టుకుంటుంది. ఈ ‘స్పేస్’ లో ట్విట్టర్ ఖాతాదారులు తమ ఫాలోవర్స్ తో లైవ్ గా ఇంటరాక్షన్ అవ్వొచ్చు. దీంతో ఈ ఫ్యూచర్ సెలబ్రిటీలకి బాగా యూస్ అవుతుంది. అయితే ఏమైందో ఏమో కానీ సడెన్ గా ఓ బ్యాచ్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ అంటూ పరోక్షంగా ప్రభాస్ ఫ్యాన్స్ ను రెచ్చకొట్టేలా మాట్లాడారట. ప్రభాస్ టైం అయిపోయింది, ఆయన సినిమాలు ఇక హిట్ అవ్వవు అంటూ.. కొంతమంది ట్విట్టర్ లో ప్రభాస్ ని ట్రోల్ చేస్తూ మాట్లాడారు. ఇక అక్కడ స్టార్ట్ అయిన గొడవ..పీక్స్ కి చేరిన్నట్లు తెలుస్తుంది. ఇక అలా ప్రభాస్ అభిమానులు కొంతమంది పవన్ కళ్యాణ్ పై నెగటివ్ కామెంట్స్ చేయడమే కాకుండా మధ్యలోకి ఆయన మూడు పెళ్లిళు..జనసేనా పేరుతో దారుణంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవాలి అంటే..ముందు ప్రభాస్ కి క్షమాపణలు చెప్పాలి..కొందరు జనసేన వాళ్ళు మా హీరో మీద ట్రోల్ల్స్ వేస్తున్నారు..ఇవి ఆపకపోతే..వచ్చే ఎన్నికల్లో ప్రభాస్ ఫ్యాన్స్ సత్త చూపిస్తాం అంటూ.. ప్రభాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో పవన్..నిజంగానే ప్రభాస్ కి సారీ చెప్పుతాడా..లేక ఎలా మ్యాటర్ కూల్ చేస్తాడు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

Share post:

Popular