NTR30 : తెర పై ఊహించని హీరోయిన్‌.. వద్దు బాబోయ్ వద్దు అంటున్న ఫ్యాన్స్ ..?

టాలీవుడ్ యంగ్ టైగర్ తారక్..వరుస సినిమాలకు కమిట్ అవుతూ..ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తున్నాడు. రీసెంట్ గా RRR సినిమా తో మంచి విజయం అందుకున్న తారక్..ఆ తరువాత డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ తో ఓ సినిమా ..అలాగే ..బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా ఫిక్స్ అయ్యాడు. ఇద్దరు బడా డైరెక్టర్ల దర్శకత్వంలో ణ్టృ సినిమా వస్తుంది అని తెలిసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ సినిమాలకి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా తారక్ పుట్టిన రోజు సంధర్భంగా..NTR 30 నుండి కొరటాల..NTR31 నుండి ప్రశాంత్ నీల్ క్రేజీ అప్ డేట్స్ ఇచ్చి..తారక్ బర్తడే ని మరింత స్పెషల్ చేశారు. కాగా, మరి కొన్ని రోజుల్లోనే తారక్, కొరటాల చిత్రం లాంఛనంగా ప్రారంభం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే సినిమా లో తారక్ కు జోడీగా నటించే హీరోయిన్ల పేరు వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ నుండి సినిమాలో అలియా అనుకున్నారు ..ఆ తరువాత దిపీకా ఫిక్స్ అంటూ టాక్ వినపడింది. లాస్ట్ కి రష్మిక అండ్ సాయి పల్లవి అన్నారు. ఇవన్ని కాకుండా ఇప్పుడు తెర పైకి ఓ క్రేజీ హీరోయిన్ పేరు వచ్చింది. బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే ఈ సినిమా తారక్ తో రొమాన్స్ చేయనుందట. కాకపోతే సెకండ్ హీరోయిన్ గా మాత్రమే ఆమె మనకు తెర పై కనిపిస్తుంది అంటూ వార్తలు పైరల్ అవుతున్నాయి. అయితే దీని పై తారక్ ఫ్యాన్స్ సముఖంగా లేరు. సినిమాలో సాయిపల్లవి, రష్మిక నే బాగుంటారు..ఆ బాలీవుడ్ పాప మనకి వద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి కొరటాల ఏం చేస్తారో..?

Share post:

Popular