మెగా డాటర్ రచ్చ..మళ్లీ మొదలైందిరోయ్..!!

మెగా డాటర్ నీహారిక చాలా క్యూట్ గా..హ్యాపీ స్మైల్ తో ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. కానీ కొన్ని సార్లు తెలిసి చేస్తుందో లేక తెలియక చేస్తుందో తెలియదు కానీ..అమ్మడు పొరబాట్లు చేసి మీడియాకి చిక్కుతుంది..నెటిజన్స్ ఆడేసుకుంటారు. ఈ మధ్య కాలంలో నీహారిక టైం అస్సలు బాగోలేదు అనే చెప్పాలి. జిమ్ ట్రైనర్ తో ఆడిన ఆటలు ..ఎంత పెద్ద ఇష్యూ అయ్యాయో మనం చూశాం. పెళ్లైన ఆడదానివేనా అంటూ బూతులు తిట్టారు నీహారికని..దీంతో కొన్ని వారాలు ఆమె ఇన్స్టా కు బ్రేక్ ఇచ్చింది.

ఏకంగా అకౌంట్ డిలిట్ చేసింది. ఇది కూడా పెద్ద ఇష్యూనే అయ్యింది. ఆ తరువాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా..ఈసారీ భారీ అవమానం జరిగింది. ఏకంగా పబ్ లో పట్టుబడింది. ఓ పక్క మెగా డాటర్..మరో పక్కా గౌరవం గల ఇంటి కోడలు ..ఇలా అర్ధరాత్రి డ్రగ్స్ విషయంలో పట్టుబడితే.. జనాలు ఊరుకుంటారా.. ఏకి పారేసారు నీహారికను. ముఖ్యంగా సో కాల్డ్ మెగా యాంటీ బ్యాచ్ ..ఆడపిల్ల అని కూడా చూడకుండా దారుణంగా..ట్రోల్ చేసారు. నీహారిక పేరు చెప్పుకుని ..పవన్, నాగబాబుని సైతం తిట్టిపోశారు.

మెగా ఫ్యామిలీ..ఓపికగా భరించింది. ఇలాంటి వాళ్లకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు అనుకున్నిందో..లేక తప్పు చేయనప్పుడు భయం ఎందుకు అనుకున్నారో..సైలెంట్ అయిపోయారు. ఇక ఇప్పుడు నీహారిక..మళ్ళీ తన ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసింది. దీంతో మెగా అభిమానులు హ్యాపీ గానే ఉన్నా.. కొందరు భయపడుతున్నారు. ఈ అల్లరి పిల్ల ఏం చేసి మళ్లీ మెగా ఫ్యామిలీ పరువు తీస్తుందో అంటూ టెన్షన్ పడుతున్నారు. నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇస్తూ.. ఆమె చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. “ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు..ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను అస్సలు పట్టించుకోను..ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్‌ అయ్యాను. పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను”అంటూ నిహారిక చేసిన పోస్ట్‌ క్షణాల్లోనే వైరల్‌గా మారింది.