సిగ్గుండాలి రా భయ్ అలా అడగడానికి.. ఫ్యాన్స్ కోపం మామూలుగా లేదుగా..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో గా నటించిన చిత్రం “సర్కారు వారి పాట”. పరశూరామ్ డైరెక్షన్ లో యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూసిన ఈ సినిమా ఎట్టకేలకు నేడు ధియేటర్స్ లో రిలీజై సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. సినిమా చూసిన జనాలు మరో పోకిరి అంటూ మహేశ్ నటనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరికొందరు జనాలు అయితే ..అంత సీన్ లేదు..జస్ట్ యావరేజ్..కామెడీ తో మాయ చేశాడు డైరెక్టర్ అంటున్నారు.

జనాల రివ్యూ సంగతి పక్కన పెడితే. ప్రతి సినిమా రిలీజ్ అయ్యాక వెంటాడే పెద్ద సమస్య..”పైరసి”. సినిమా రిలీజై..తెర పై బొమ్మ పడితే చాలు కాచుకు కూర్చుంటారు పైరసి రాయళ్లు..అలా బొమ్మ పడటం..ఇలా కెమారాస్ లో రికార్డ్ చేసి..వెబ్ సైట్ లో పెట్టేస్తుంటారు. ఇలా ప్రతి సినిమాకు జరిగేదే. కానీ, ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ కొత్త పద్ధతి తీసుకొచ్చింది. ఎక్కడైన మీరు సర్కారు వారి పాట సినిమా ఫేక్ చూసిన, వెబ్ సైట్ లో ఆ లింక్ కనిపించిన వెంటనే ..ఈ క్రింది నంబెర్స్ కు కంప్లైంట్ చేయండి అంటూ పోస్ట్ చేశారు. వాళ్ళ భయం వాళ్లది. ముందు జాగ్రత్తగా చెప్పుకొచ్చారు.

కానీ, కొందరు నెటిజన్స్ ఈ పోస్ట్ పెట్టిన మైత్రి మూవీ మేకర్స్ పై మండి పడుతున్నారు . ” సినిమా టైటిల్ దగ్గర నుండి.. పాటలు, ఫైట్ లు, లుక్స్ అన్నీ నువ్వే లీక్ చేసి..ఇప్పుడు ఈ పైరసీ కంప్లైంట్ ఏంటి..సిగ్గుండాలి ఇలా అడగదానికి ” అంటూ బూతులు తిడుతున్నారు. మనకు తెలిసిందే..సర్కారు వారి పాట సినిమా టైటిల్ ..అఫిషియల్ గా అనౌన్స్ చేయకముందే నెట్టింట లీకైంది. ఇక కళావతి సాంగ్ అయితే టోటల్ పాట్ రిలీజ్ కి ముందే నెట్టింట ప్రత్యేక్షమైంది . ఆ టైంలో తమన్ చాలా ఎమోషనల్ అయ్యారు. దీంతో ఇప్పుడు ఇలా పైరసీ కంప్లైంట్ అంటూ పోస్ట్ పెట్టేసరికి అభిమానుల్లో కోపం పీక్స్ కు వెళ్లిన్నట్లు తెలుస్తుంది.

Share post:

Latest