ఇప్పటికైన అర్ధమైయిందా .. వాళ్ల నోర్లు మూయించిన మహేశ్..?

డైనమిక్ డైరెక్టర్ పరశూరామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు..మహానటి కీర్తి సురేష్ జంటగా కలిసి నటించిన చిత్రం “సర్కారు వారి పాట”. మూడేళ్లు గా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా నేడు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొందరు జనాలు సినిమా యావరేజ్ అంటున్న అసలు టాక్ మాత్రం ఫ్యాన్స్ బయటపెట్టేశారు. సినిమాలో కధ పాతదే అయినా.. పరశూరామ్ తెరకెక్కించిన విధానం మాత్రం చాలా మందికి నచ్చింది. ముఖ్యంగా సినిమా లో కీర్తి-మహేశ్ లవ్ ట్రాక్ వేరే లెవల్ అని చెప్పక తప్పదు.

సముద్రఖని తో మహేశ్ వార్ కూడా జనాలను బాగా అట్రాక్ట్ చేసింది. ఈ సినిమాలో కీర్తి, మహేశ్ కాకుండా హైలెట్ అయినా పాత్ర వెన్నెల కిషోర్ దే. కామెడి టైమింగ్స్ సూపర్బ్. సినిమాకి ఆయన కామెడీ ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. ఇక తమన డ్రమ్‌స్ మ్యూజిక్ కేకోన్ కేక అంతే. సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి తమన్ మ్యూజిక్ కూడా ప్లస్ అయ్యింది. ఓవర్ ఆల్ గా సినిమా మంచి క్లాస్ మాస్ ఎంటర్ టైన్ మెంట్. అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టిన్నట్లే. కాగా, సినిమా చూసిన మహేశ్ అభిమానులు ఓ సో కాల్డ్ భజన బ్యాచ్ కి కౌంటర్లు వేయడం స్టార్ట్ చేసారు.

నిజానికి ఈ సినిమా ఓ డైలాగ్ చాలా కాంట్రవర్షీయల్ గా మారింది. జగన్ తర్చు వాడే డైలాగ్”నేను విన్నాను..నేను ఉన్నాను”. ఈ డైలాగ్ మహెశ్ నోట వినగానే ఓ బ్యాచ్ నెగిటీవ్ గా స్ప్రెడ్ చేసింది. జగన్ ని ఇంప్రెస్ చేయడానికే ఈ డైలాగ్ వాడారంటూ డప్పు కొట్టి మరి చెప్పిన్నట్లైంది. దీని పై స్పందించిన మహేశ్, పరశూరామ్ సినిమా చూశాక ఆ డైలాగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ..మీకే అర్ధమౌతుంది.. రాజకీయాలకి దీని కి ఏ సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు సినిమా విడుదలైయాక ఆ డైలాగ్ ఎందుకు పెట్టారో ఆ భజన బ్యాచ్ కి అర్ధమైందా అంటూ మహేశ్ ఫ్యాస్ రీవర్స్ కౌంటర్లు స్టార్ట్ చేసారు. కొందరు ఫ్యాన్స్ అయితే వాళ్ల నోర్లు మూయించాడు మహేశ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టోటల్ గా ఆ డైలాగ్ పెద్ద దుమారమే రేపుతుంది.

Share post:

Popular