కేక పెట్టించేశాడ్రా… తార‌క్ నుంచి ట్రిఫుల్ ధ‌మాకా… !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా వ‌చ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్లో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్‌తో ఎన్టీఆర్ ఇప్పుడు వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌ను ఓకే చేసుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ – కొర‌టాల కాంబోలో సినిమా వ‌స్తోంది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మించే భారీ పాన్ ఇండియా సినిమాలో ఎన్టీఆర్ న‌టిస్తాడు. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్‌, బుచ్చిబాబు సానా ఇలా క్రేజీ డైరెక్ట‌ర్లు ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు క్యూలో ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ నెల 20న ఎన్టీఆర్ బ‌ర్త్ డే . ఈ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఎన్టీఆర్ త‌న ఫ్యాన్స్‌కు త్రిబుల్ ధ‌మాకా ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. మూడు అదిరిపోయే అప్‌డేట్ల కోసం తార‌క్ అభిమానులు కాచుకుని ఉన్నార‌న్న టాక్ కూడా ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. అదే రోజు ఎన్టీఆర్ – కొర‌టాల షూటింగ్, టైటిల్ గురించి ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని అంటున్నారు.

ఆ త‌ర్వాత పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌ ప్రశాంత్ నీల్ తో చేసే ఎన్టీఆర్ 31వ సినిమాకి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉండొచ్చని తెలుస్తుంది. ఈ సినిమా గురించి అధికారిక ప్ర‌క‌ట‌న అదే రోజు ఉంటుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే కాదు మ‌రో అదిరిపోయే ట్విస్ట్ కూడా ఆ రోజు ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఆ అప్‌డేట్ ఏంటో కాదు ఎన్టీఆర్ – శంక‌ర్ కాంబినేష‌న్లో సినిమా. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సినిమాపై గ‌త కొంత కాలంగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ట‌. ఆ రోజు ఈ సినిమా గురించి కూడా ఎనౌన్స్ మెంట్ ఉంటుందంటున్నారు. వీటితో పాటు అదేరోజు ఓటిటి లో “రౌద్రం రణం రుధిరం” సినిమా రిలీజ్ అవుతోంది.

Share post:

Popular