వావ్: పాన్ ఇండియా హీరోలల్లో ఎన్టీఆర్ టాప్ 2…నెం 1 ఎవరో తెలుసా..?

ప్రస్తుతం ఇప్పుడు బడా బడా స్టార్స్ అందరు పాన్ ఇండియా సినిమాల పై పడ్డారు. తమ నెక్స్ట్ సినిమాలు అన్ని ఆ స్దాయిలోనే తెరకెక్కించేలా చూసుకుంటున్నారు. ఒక్క దెబ్బతో అన్ని భాషలు కవర్ చేయచ్చు..పైగా ఫుల్ పాపులారిటీ వస్తుంది అన్ని భాషల్లోను ..అంతేనా , సినిమా హిట్ అయితే రెమ్యూనరేషన్ కూడా డబుల్ ఎక్స్ పెక్ట్ చేయచ్చు..అవి కాకుండా ఇప్పుడు మరికొందరు హీరోలు షేర్లు తీసుకుంటున్నారు. దీంతో బిగ్ స్టార్స్ అందరు కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు.

ఇక ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ..ఈ ఏడాదిలో నిర్దేశిత సమయానికి గాను పలు రంగాలకు సంబంధించిన పాపులర్ స్టార్స్ పై ఓ సర్వే చేసింది. ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా జరిగింది. వెండితెర, బుల్లితెర నటులు, స్పోర్ట్స్ స్టార్స్ ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులపై సర్వే నిర్వహిస్తారు.ఇండియా వ్యాప్తంగా పోల్స్ నిర్వహించి సర్వేలో పాల్గొన్నవారి అభిప్రాయాల ఆధారంగా ర్యాంకింగ్స్ కేటాయించింది. ఇక ఈ క్రమంలోనే మన తెలుగు హీరోలు అందరిని దాటుకుని తారక్ నెం 2 స్దానం అందుకున్నాడు.

ఇప్పటి వరకు తారక్ చేసిన పాన్ ఇండియా మూవీ ఒక్కటే..అదే RRR. ఈ సినిమాలో ఆయన పర్ ఫామెన్స్ కి గాను..పాపులారిటీకి గాను జనాలు 2 స్దానం ఇచ్చారు. ఇక మొదటి స్దానం లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఉన్నాడు. ఇక్కడ ఆశ్చర్య కర విషయం ఏమిటంటే.. ఒక్క పాన్ ఇండియా హిట్ లేకున్నా విజయ్ టాప్ పొజిషన్ అందుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక మూడో స్ధానంలో ప్రభాస్ నిలబడ్డాడు. నాలుగో ప్లేస్ లో బన్నీ, ఐదో ప్లేస్ లో అక్షయ్ కుమార్ స్దానం దక్కించుకున్నారు. మరో కోలీవుడ్ స్టార్ అజిత్ 6వ స్థానంలో నిలబడగా..రామ్ చరణ్ 7 స్దానం దక్కించుకున్నారు.

Rajinikanth, Kamal Haasan, Vijay And Others at the Nadigar Sangam Protest To Set Up The Cauvery Management Board

Share post:

Popular