అయ్యయ్యో..ఆ విషయంలో అనిల్ బిస్కెట్ అయ్యాడే..?

గత మూడేళ్లు గా ఊరిస్తూ ఊరిస్తూ..ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించడానికి నేడు ధియేటర్స్ లోకి వచ్చింది F3. అనిల్ రావి పూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ అలాగే యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించారు. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా..కామెడీ టాక్ తో ముందుకు వెళ్తుంది. గతంలో అనిల్ తెరకెక్కించిన F2 కి ఇది సీక్వెల్ కావడంతో..ఆ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద హిట్ అవ్వడంతో సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

ఇక నేడు రిలీజై ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ సినిమాలో భార్యలు కాన్సెప్ట్ తీసుకున్న అనిల్..ఈ సినిమాలో డబ్బు కాన్సెప్ట్ తీసుకుని..దానికి ఆడవాళ్లను మ్యాచ్ చేస్తూ..తనదైన స్టైల్ లో తెరకెక్కించారు. సినిమా పరంగా అనిల్ కుమ్మేశాడు..ఆయన డైరెక్షన్..డైలాగ్స్..కామెడీ పండించిన విధానం ధియేటర్స్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తుంది అనడంలో సందేహం లేదు.

కానీ, సెకండ్ హాఫ్ లో అనిల్..ఎమోషన్స్ , సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ విషయంలో అనిల్ సక్సెస్ కాలేకపోయాడని టాక్ వినిపిస్తుంది. అనిల్ అంటే కామెడీ నే అనే మార్క్ పడకూడదు అనుకున్నాడో ఏమో..ఇంటర్వెల్ తరువాత రూట్ మారుస్తూ..తన ఫార్ములాను మార్చేసాడు . సినిమా లో కామెడీ సీన్స్ పండినంతగా..సెంటిమెంట్ సీన్స్ పడలేదు అంటున్నారు సినిమా చూసిన జనాలు. అంతేనా..F2 తో కంపేర్ చేస్తే ఈ సినిమాలో అనిల్ మ్యాజిక్ మిస్సైంది..కానీ, ప్రస్తుత కాలంలో ఇలా నవ్వించే సినిమా అయితే లేదు..సో, జనాలు దానికోసమైన ఒక్కసారి ఈ సినిమా చూడచ్చు అంటూ రివ్యూలు ఇస్తున్నారు. మరి కలెక్షన్స్ పరంగా ఎలా ఉంటుందో..?

Share post:

Popular