పాన్ ఇండియా హీరోలు..బాలయ్యను చూసి నేర్చుకోండయ్యా..?

యస్.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నందమూరి నట సింహం బాలకృష్ణ గోపీచంద్ మల్లినేని తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటితో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీశాక ..ఎక్కువ కాలం టైం తీసుకోకుండా వెంటనే తాను కమిట్ అయిన ప్రాజెజెక్ట్స్ ని లైన్లో పెట్టే పనిలో పడ్డారు బాలయ్య. ఈ క్రమంలోనే NBK107 షూటింగ్ ను సరవేగంగా ఫినీష్ చేస్తున్నారు బాలయ్య. సినిమా గురించిన కొత్త కొత్త అప్ డేట్స్ నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతుంది. ఈ సినిమా లో బాలయ్య డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడని ఇప్పటికే టాక్ బయటికి రాగా.. అందులో ప్రజెంట్ జెనరేషన్ బాలయ్య యంగ్ లుక్ లో అద్దిరిపోతారని వార్తలు బయటకు వచ్చాయి.

ఇక ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య ని చూస్తే అభిమానులు రచ్చ రచ్చ చేస్తారు అంటున్నారు సినీ మేకర్స్. టోటల్ గా ఓ సమర సింహా రెడ్డి, నరసింహా నాయుడు.. ఈ రేంజ్ లో ఉంటుందట బాలయ్య ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. వింటుంటేనే సినిమా ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని అభిమానులు ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. ఇక ఈ సినిమా లో మొదటిసారి బాలయ్య సరసన స్టార్ డాటర్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్లాష్ బ్యాక్ లో బాలయ్య స్టోరీకి అందాల బొద్దుగుమ్మ.. మీరా జాస్ మిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అంతేకాదు ఈ సినిమాలో ఓ మాస్ మసాలా ఐటెం సాంగ్ ఉందని.. దానికి కోసం ఓ హాట్ బాలీవుడ్ బ్యూటీ ని దింపే పనుల్లో ఉన్నారట డైరెక్టర్.

కాగా, ఇవన్నీ బాగానే ఉన్నా..ఈ సినిమాకి బాలయ్య తీసుకునే రెమ్యూనరేషన్ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. జనరల్ గా బాలయ్య నాకు ఇంత పారితోషకం కావాల్ని డిమాండ్ చేయరు అది అందరికి తెలిసిందే. కానీ, రీసెంట్ గా అఖండ లాంటి బ్లాక్ బస్టర్ అందుకుని 200 కోట్లకు పైగా సాధించిన కలెక్షన్స్ చూశాక అందరు.. బాలయ్య తన నెక్స్ట్ సినిమాకి భారీ స్ధాయిలో పారితోషకాని పుచ్చుకుంటున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అవన్ని ఫేక్ న్యూస్ అని తెలుస్తుంది. బాలయ్య ఈ సినిమాకి మీడియం రేంజ్ లోనే పుచ్చుకుంటున్నారట. అఖండ సినిమాకు తీసుకున్న పారితోషకానికి ఒక్క కోటి ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అంతేనట. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్స్ తీసుకుంటూ భారీ ఫ్లాప్ ఇస్తున్న కొందరు బడా హీరోలు ఈ విషయంలో ఒక్కసారి బాలయ్యను చూసి నేర్చుకోండి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest