ప్రశాంత్ ప్లాన్ ఫెయిల్..ఓరి ఓరి ప్రభాసో..ఇప్పుడు ఏం చేస్తావ్..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్..ప్రస్తుత్తం ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రతి సినిమాను పాన్ ఇండియా స్దాయిలోనే రిలీజ్ చేయాలని భీష్మించుకుని కూర్చున్నాడు. నిజానికి ప్రభాస్ కి ఇంతటి క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం “బాహుబలి”. ఇది అందరికి తెలిసిన నిజమే. అప్పటి వరకు ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు..అభిమానించేవారు. కానీ బాహుబలి తరువాత వాళ్లు ప్రభాస్ ని ఆరాధిస్తున్నారు. బాహుబలి తరువాత “సాహో” లాంటి ఫ్లాప్ పడ్డా..ప్రభాస్ కి మాత్రం మంచి మంచి అవకాశాలు వచ్చాయి. దాని ఎఫెక్ట్ నే ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఐదు ప్రాజెక్ట్లు ఉండటానికి కారణం.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన రాధ్యే శ్యామ్ ఫ్లాప్ అయ్యినప్పటికి..ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా హీరో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో “ప్రాజెక్ట్ K”..అలాగే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో “సలార్” చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు ప్రభాస్. అయితే, ప్రభాస్ లుక్స్ పరంగా ప్రశాంత్ డిసప్పాయింట్ మెంట్ లో ఉన్నారట. నిజానీకి ప్రభాస్ తో సినిమా కమిట్ అయ్యిన్నప్పటీకి ఇప్పటికి ప్రభాస్ లో చాలా ఛేంజ్ వచ్చింది. ముఖం లో గ్లో పోయింది. లావు అయిపోయాడు..డల్ ఫినిష్ కనిపిస్తుంది.

దీంతో ప్రభాస్ లుక్స్ మారాకనే సినిమా షూట్ చేద్దామాని ప్రశాంత్ ఫిక్స్ అయ్యారట. ఇన్నాళ్లు సైలెంట్ అయిన డైరెక్టర్ ఇప్పుడు మాత్రం మొహమాట పడితే కష్టం అనుకుని..ఫ్రాంక్ గా చెప్పేశారట. దీంతో ప్రభాస్ బరువు తగ్గే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రాజెక్ట్ K చిత్రానికి మాత్రం ప్రభాస్ ఇప్పుడు ఉన్న లుక్స్ నే కరెక్ట్ గా సెట్ అవుతున్నాయని..సినిమా షూట్ కంప్లీట్ అయ్యేవరకు ఈ లుక్ నే మెయున్ టైన్ చేయాలని అశ్విన్ అడుగుతున్నారట. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య నలిగిపోతున్నాడు ప్రభాస్. మరో పక్క ఈ సినిమాలు కంప్లీట్ అవ్వగానే మారుతి తో, సందీప్ వంగా తో కమిట్ అయ్యి ఉన్నాడు. మరి ప్రభాస్ ఏం చేస్తాడో ,,ఈ ప్రాబ్లమ్ నుండి ఎలా బయటపడతాడో..?

Share post:

Latest