బాలయ్య సినిమాను కొరటాల కాపీ కొట్టాడు..ఆ స్టార్ హీరో బ్లాక్ బస్టర్ సినిమా అదే..!!

వామ్మో..రోజు రోజుకు సోషల్ మీడియాలో కొరటాల శివ పై నెగిటివిటి ఎక్కువైపోతుంది. నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం..కొరటాల కత్తి..ఆయనతో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్..ఇండస్ట్రీ లెక్కలు మారిపోతాయి అని కామెంట్స్ చేశారు. కానీ, ఇప్పుడు పరిస్ధితి మరోలా ఉంది. కేవలం ఒక్కటి అంటే ఒక్కటి సినిమా ఫ్లాప్ అవ్వగానే ఆయన పై పగ పట్టిన్నట్లు కొందరు ట్రోల్ చేస్తున్నారు. కొందరు బూతులు తిడుతున్నారు. అయినా కానీ కొరటాల చాలా సైలెంట్ గా ఉన్నారు.

కాగా, ఇంత నెగిటివిటీ మూటకట్టుకున్న కొరటాల శివ పై..సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మధ్య కాలంలో ఆయన పలు యూట్యూబ్ ఛానెల్స్ కు వరుస ఇంటర్వ్యులు ఇస్తూ..హీరో, హీరోయిన్ల పై ఊహించని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇదే క్రమంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యులో ..రీసెంట్ గా డైరెక్టర్ కొరటాల శివ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

కొరటాల శివ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ సినిమాగా తెరకెక్కిన “శ్రీమంతుడు “సినిమాను ఆయన బాలయ్య సినిమా నుండి కాపీ కొట్టి..మహేశ్ తో తీశాడు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా కొరటాల పై కొత్త అనుమానులు పుట్టుకొస్తున్నాయి అంటున్నారు జనాలు. గీతా కృష్ణ మాట్లాడుతూ..”కె విశ్వనాథ్ గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న టైంలోనే నందమూరి బాలకృష్ణ నటించిన జననీ జన్మభూమి సినిమాని తెరకెక్కించానని ..నిజానికి అప్పుడప్పుడే ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు.. ఆ సినిమాల్లో బాలయ్య సొంత ఊరికి వెళ్లి సేవా కార్యక్రమాలు చేస్తూ ఊరిని బాగు చేస్తారు..ఇక అదే ఫార్ములాని ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్లు కొరటాల మార్చి..ఆయన స్టైల్ లో మహేశ్ తో శ్రీమంతుడు అంటూ తెరకెక్కించాడు”అంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో గీత కృష్ణ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Share post:

Popular