బిగ్ ఆఫర్: బాలయ్య సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్..లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇదే..?

తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో గా వచ్చిన బిగ్ బాస్..అంటే జనాలో పిచ్చ క్రేజ్ ఉంది. షో గురించి బూతులు తిడుతూనే..ఆ షోని రెగ్యూలర్ గా ఫాలో అయ్యే వాళ్లు చాలా మంది ఉన్నారు. కొందరు కంటెస్టెంట్లు ఈ షోకి డబ్బు కోసం వెళ్లితే ..మరికొందరు పాపులారిటీ కోసం వెళ్తారు. ఆ షో ద్వారా మనల్ని మనం ప్రూవ్ చేసుకుని..లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుని చాలా మంది ఆ షోకి వెళ్లి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వారు ఉన్నారు.

వాళ్లల్లో అరియానా..ముందు వరుసలో ఉంటుంది. ఈ బిగ్ బాస్ పుణ్యమా అని ఆమె పాపులర్ అయ్యింది. అంతక ముందు RGV తో ఇంటర్వ్యులు చేసినా..ఫాలోయింగ్ తో..బిగ్ బాస్ లోకి వచ్చింది. కానీ, బిగ్ బాస్ లో ఆమె ఆడిన తీరు..ఆమె కాన్ఫిడెంట్, ఆమె నిజాయితీ..అందరిని ఆకట్టుకుంది ,,బిగ్ బాస్ సీజన్ 4 లో టాప్ 5 లో ఒక్క కంటెస్టెంట్ గా నిలిచి..అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది.

ఇక అదే పాపులారిటీతో బిగ్ బాస్ OTT లోకి వెళ్ళి టాప్ 5 ఫైనలిస్ట్ లో ఒకరు గా నిలిచి..10 లక్షల క్యాష్ తీసుకుని..టాప్ 4 నుండి ఎలిమినేట్ అయ్యింది. ఈ క్రమంలోనే హౌస్ లోకి గెస్ట్ గా వచ్చిన అనిల్,సునీల్ తో ఓ ఆట ఆడుకుంది. వీళ్ల మధ్య చాలా ఫన్నీ కాన్వర్షేషన్స్ జరిగాయి. టోటల్ ఎపిసోడ్ కి బిందు మాధవి టైటిల్ గెలిచినా రాని అపీరియన్స్..అరియానా, అనీల్ మాటల్లో కనిపించింది. అరియానాని అనీల్ ఏడిపించడం ..ఆమె దొంగసచినోళ్లు అనడం..ఆమె చాలాకి మాటలు అందరిని బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే అనీల్ ఆమె కు తన తదుపరి సినిమాల్లో అవకాశం ఇవ్వనున్నాడని టాక్ వినిపిస్తుంది. నిజానికి నాగార్జున బిందు మాధవిని రీఫర్ చేశాడు. కానీ, అనీల్ అరియానా పై ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ అల్లరి , చలాకీ తనం అనీల్ కు బాగా నచ్చేశాయట. బిందు మాధవి కి కూడా ఓ రోల్ ఇచ్చేటట్లు ప్లాన్ చేస్తున్నా..అనీల్ కళ్లన్ని అరియానా పైనే ఉన్నాయట. నిజంగా అరియానికి ఇది లైఫ్ టర్నింగ్ పాయింటే అంటున్నారు అభిమానులు. మరి చూడాలి ఏం జరుగుతుందో..?

Share post:

Popular