ఐశ్వర్యరాయ్ ఆస్తి విలువ.. రెమ్యునరేషన్ లెక్క‌లు చూస్తే మ‌తిపోవాల్సిందే..!

టాలీవుడ్ ,బాలీవుడ్ , కోలీవుడ్ వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ లలో ఐశ్వరరాయ్ కూడా ఒకరు. ఈ స్టార్ హీరోయిన్ ఒక్కో సినిమాకి 12 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక 1994వ సంవత్సరంలో ఐశ్వర్యారాయ్ మిస్ వరల్డ్ గా ఎంపికైంది. తర్వాత సినిమా రంగంలో వరుస సినిమాల్లో నటించిన ఐశ్వర్యరాయ్ ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

శంకర్ డైరెక్షన్లో వచ్చిన రోబో సినిమాతో ఈమె సౌత్ ఇండియాలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.
ఇక ఐశ్వర్య ఆస్తుల విషయానికి వస్తే దాదాపుగా రూ. 776 కోట్ల రూపాయలు ఉన్నట్లు గా సమాచారం. ముంబైలో ఐశ్వర్యకు సొంతగా ఒక బంగ్లా కూడా ఉన్నది. ఆ బంగ్లా విలువే దాదాపుగా రూ.112 కోట్ల రూపాయలనీ సమాచారం. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ తన భర్త, ఫ్యామిలీతో కలిసి అక్కడే నివసిస్తున్నట్లు గా తెలుస్తోంది.

ఐశ్వర్యరాయ్ కి కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. ఐశ్వర్యరాయ్ కి ఖరీదైన కార్ కూడా ఉన్నది. దాని ధర రూ.21 కోట్ల రూపాయలు. ఐశ్వర్యారాయ్ కేవలం సినిమాలలోనే కాకుండా పలు ఇంటర్నేషనల్ బ్రాండ్ లకు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ నే ఐశ్వర్యారాయ్ దాదాపుగా రూ.90 కోట్ల రూపాయలు ఏడాదికి ఆదాయం చేసుకుంటోంది. ఐశ్వర్య రాయ్ దగ్గర దాదాపుగా రూ. 45 కోట్ల విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నట్లుగా సమాచారం.

ఇక సౌత్ లో కూడా ఐశ్వర్యరాయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈమె మరోసారి హీరోయిన్ గా నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఐశ్వర్యారాయ్ సౌత్ సినిమా ఇండస్ట్రీ పై దృష్టి పెడుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఐశ్వర్యారాయ్ సౌత్ లో నటించకపోయినప్పటికీ ప్రేక్షకులలో మాత్రం ఈమె క్రేజ్ తగ్గలేదు అని చెప్పవచ్చు.