అడ్రెస్ లేకుండా పోయిన పవన్ డైరెక్టర్..ఇప్పుడు చెప్పండి సినిమా హిట్టా..ఫట్టా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరో గా..రానా దగ్గుబాటి విలన్ గా నటించిన క్రేజీ చిత్రం “భీమ్లా నాయక్‌ “. మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా అయ్యప్పనుం కోషీయుం కు రీమేక గా తెలుగు రిలీజ్ అయ్యి..పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా లో హీరోయిన్లు గా నిత్యా మీనన, సంయుక్తా మీనన్ నటించి మెప్పించారు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్స్ కి పెద్ద కంటెంట్ ఉండదు..అంతా హీరో, విలన్ ల మధ్యనే ఉంటూంది రగడ. ఎదుటి వాడి ఈగో ని హర్ట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పే కధనే ఈ సినిమా.

ఈ సినిమాకి దర్శకుడిగా సాగర్ చంద్ర వ్యవహరించారు. సినిమా తెర పై పేరైతే ఈయనది పడింది కానీ.. పాపం, ఇప్పటికి చాలా మంది ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకుంటున్నారు. సినిమాలో ఆయన మార్క్ క్లీయర్ గా అర్ధం అవుతుంది. పవన్ ఫ్లాష్ బ్యాక్ చూస్తేనే ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అని పసిగట్టేశారు జనాలు. ఇక సినిమా సెట్స్ లోకూడా అంతా హడావుడి త్రివిక్రమ్ శ్రీనివాస్ దే.

ముందు నుంచి కూడా ఆ సినిమాకు సంబంధించి ఏ క్రెడిట్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ నే తీసుకున్నారు..జనాలు కూడా ఆయనకే ఇచ్చారు. సాగర్ చంద్ర కి ఏం దక్కినట్లు కనిపించలేదు. అంతేకాదు తమన్ అందించిన పాటలనౌ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ నే దగ్గర ఉండి చూసుకున్నారట. ఈ విషయం అప్పట్లో యమ హాట్ గా ట్రేండ్ అయ్యింది. మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూడా నే దగ్గర ఉండి చూసుకున్నారట. కీలక పాత్ర వహించాడు . దీంతో సాగర్ చంద్ర ఈ సినిమాలో ఆటలో అరటిపండు అయ్యిపోయాడు. ప్రజెంట్ ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అస్సలు ఆయన మాట కూడా వినిపించట్లేదు. దీంతో పవన్ హేటర్స్ మళ్ళీ మళ్ళీ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు చెప్పండి సినిమా హిట్ అయితే డైరెక్టర్ ఇలా అడ్రెస్ లేకుండా పోతాడా..?అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Popular