ఆ విషయంలో ఇండియాలోనే నెం 1 స్ధానం.. శభాష్ బాలయ్య..!!

నందమూరి వారసులకు నెం 1 స్దానం సంపాదించడం కొత్తేమీ కాదు. తరతరాలుగా ఆ ప్లేస్ వాళ్ళకే దక్కుతూ వస్తుంది..మొదట్లో నందమూరి తారకరామారావు గారు..ఆ తరువాత నట సింహం బాలకృష్ణ..ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఇక రాబోయే కాలంలో తారక్ కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్..ఖచ్చితంగా వాళ్ళు నాన్న ను మించిపోయే నటులు అవుతారు..అది వాళ్ల బ్లడ్ లోనే ఉంది.

ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలల్లో నెం 1 ఎవ్వరు అనగానే టక్కున చెప్పేది బాలయ్యఅని..యంగ్ హీరోలల్లో తారక్ అని చెప్పుతుంటారు. వాళ్ళ చూస్ చేసుకునే సినిమా కధలు, యాక్షన్ సీన్స్, పాటలు, యాక్స్టింగ్ స్కిల్స్, తెగింపు అన్నీ అలానే ఉంటాయి. కొరనా కాలంలో ఇండస్ట్రీ లెక్కలు కుదేళ్లు అయిన టైంలో ఏ హీరో కూడా తన సినిమా ని రిలీజ్ చేసే సాహసం చేయని టైంలో..ఇండస్ట్రీకి ఒక్క మగాడు లా బాలయ్య..ధైర్యంగా కష్టాని నమ్ముకుని..అఖండ సినిమా రిలీజ్ చేసారు.

బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎన్నో సంచలన రికార్డులను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే బాలయ్య బాలకృష్ణ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ రోజుల్లో ఓ సినిమా రిలీజ్ అయితే పట్టుమంటే 25 రోజులు కూడా ధియేటర్స్ లో లేకుండా వెళ్లిపోతుంది. కానీ , బాలయ్య అఖండ సినిమా మాత్రం ఏకంగా ఐదు నెలల పాటు బొమ్మ బ్లాస్ట్ అయ్యింది. అంటే దాదాపు 175 రోజులు బాలయ్య సినిమా ధియేటర్ లో ఆడింది. ఈ క్రేడిట్ దక్కించుకున్న ఫస్ట్ హీరో బాలయ్యనే. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని రామకృష్ణ థియేటర్‌లో అఖండ సినిమా సక్సెస్ ఫుల్ గా 175 రోజులు ఆడి..బాక్స్ ఆఫిస్ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు.

Share post:

Popular