ఏం బన్నీ ..ఈ మాటలు నీకు వినిపిస్త లేదా.. ?

బన్నీ..ఇండస్ట్రీలో యమ యాక్టీవ్ గా ఉండే హీరోలల్లో ఈ అల్లు అర్జున్ కూడా ఒకరు. ఎప్పుడు సంతోషంగా..చలాకిగా..చిల్ అవుతూ…చుట్టు పక్కన వాళ్లని చిల్ చేస్తూ సరదాగా ఉంటాదు. ఆయన పక్కన ఉంటే అంతా జోష్ ఫుల్ గా సాగిపోతుంది. ఇక బన్నీ సెట్స్ లో ఉంటే అస్సలు టైమే తెలియదట. అందరితో కలివిడి గా మాట్లాడుతూ..ఆటపట్టిస్తూ అల్లరి చేస్తూ చాలా సరదాగా ఉంటుందని ఆయనతో నటించే ఆర్టిస్ట్లు చెప్పుతుంటారు. బన్నీ తో ఎంజాయ్ మెంట్ మామూలూగా ఉండదు మరి అంటూ డైలాగ్స్ కూడా కొడుతుంటారు.

ఏ ఫంక్షన్ కి వచ్చినా బన్నీ స్టేజీ ఎక్కి మైక్ పట్టుకుంటే.. మిగత వాళ్ళు బలాదూర్ అవ్వాల్సిందే. ఆయన మాటల్లోనే తెలియని ఓ మ్యాజిక్ ఉంటుంది. బన్నీ పాన్ ఇండియా హీరో నటించిన చిత్రం “పుష్ప..ది రూల్”. సుకుమార్ డైరెక్షన్ లో పోయిన ఏడాది డిసెంబరు 17 న గ్రాండ్ గా రిలీజై బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమాలోని పాటలు, డైలాగులు, ఓ రేంజ్ లో పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా “పుష్ప..పుష్ప రాజ్..నీ యవ్వ తగ్గేదేలే”..అంటూ బన్నీ చెప్పే డైలాగ్ ఇప్పటికి ట్రెండింగ్ లో ఉంది.

ఇక స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ లోనే ఫస్ట్ టైం చేసిన ఐటెం సాంగ్..”ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ”..ఈ పాట సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఇప్పటి ప్రతి ఒక్కరి మొబైల్ లో ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. అంత బాగా అలరించింది. అయితే, పుష్ప పార్ట్ 2 సినిమా పై ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ అప్ సెట్ అవుతున్నారు. మిగతా హీరోలు అందరు తమ తదుపరి సినిమాలకు సంబంధించిన అనౌన్స్ మెంట్ లు ఇస్తుంటే..బన్నీ ఏంటి సైలెంట్ అయిపోయాడు..బయటకు కనిపించడు..అస్సలు ఏమైంది..అంటూ చర్చించుకుంటున్నారు. కనీసం సుకుమార్ అయినా పుష్ప పార్ట్ 2 గురించి అప్ డేట్ ఇవ్వాలిగా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలి బన్నీ తన ఫ్యాన్స్ రిక్వెస్ట్ వింటాడో లేదో..?

Share post:

Popular