నాగార్జున‌తో ఎఫైర్ అందుకే హైద‌రాబాద్‌లో… ట‌బు షాకింగ్ ఆన్స‌ర్‌…!

తెలుగు సినిమా ద్వారా బాగా పాపులారిటీ ను సంపాదించుకున్న చాలామంది హీరోయిన్లు బాలీవుడ్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఇక అందాల తార శ్రీదేవి, నగ్మా లాంటి ఎంతో మంది తెలుగులో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చి అక్కడే సెటిల్ అయిపోయారు. ఇక ఇదే జాబితాలో అందాల తార టబు కూడా ఉండటం గమనార్హం. నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న టబు ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీ కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈమె చాలా అరుదుగా మాత్రమే తెలుగు సినిమాలలో నటించింది.

ఇకపోతే ఈమె బాలీవుడ్లో పాగా వేసినప్పటికీ అప్పుడప్పుడు హైదరాబాద్ కి వస్తూ ఉంటుంది. కానీ ఈమె హైదరాబాద్ కి చెందిన నటి అని చాలా మందికి తెలియదు. ఇకపోతే అప్పట్లో అక్కినేని నాగార్జునతో టబు ఎఫైర్ నడిపింది అనే వార్తలు కూడా బాగా వచ్చాయి. అందుకే వరుసగా నాగార్జున , టబు సినిమాలు చేసిందని ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నిన్నే పెళ్ళాడుతా, ఆవిడా మా ఆవిడే వంటి సినిమాలలో నాగార్జున – టబు జంట కన్నుల విందు చేసిందని చెప్పవచ్చు.

ముఖ్యంగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా.. వీరిద్దరి మధ్య రొమాన్స్ కూడా చాలా బాగా కుదిరింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో మహాలక్ష్మి పాత్రకు కుర్రకారు సైతం ఫిదా అయ్యారు. టబు అసలు పేరు తుబుస్సుమ్ హస్మి. 1971 నవంబర్ 4వ తేదీన హైదరాబాద్కు చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించింది. అయితే ఇప్పటికి కూడా ఈమె పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. కానీ ఇండస్ట్రీలో మాత్రం నాగార్జున కోసమే ఆమె వివాహం చేసుకోలేదనే టాక్ కూడా నడుస్తోంది.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె నాగార్జున తో ఉన్న రిలేషన్ షిప్ గురించి నోరు విప్పింది.. నాగార్జున తాను మంచి స్నేహితులమని.. తమ ఇద్దరి మధ్య ఏం లేదని తెలిపింది. గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన మాట నిజమే అని.. అయితే అది నాగార్జున కోసం కాదు అని.. ఇక్కడ ఒక ఇంటిని కొనుగోలు చేశానని.. అందుకోసమే ఇక్కడికి వచ్చానని కూడా తెలిపింది.
ఇక టబు ఇటీవల టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో సినిమా తో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది

Share post:

Popular