పాపం..ఆ హీరో చేసిన పనికి పూజా గుండె ముక్కలైపోయిందట..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే..కత్తి లాంటి ఫిగర్ అంటారు అందరు. కెరీర్ మొదట్లో ఒక్క సినిమా హిట్ కొట్టడానికి నానా తంటాలు పడ్డా..ప్రస్తుతం మాత్రం ఫుల్ జోరు మీద ఉంది. బడా బడా సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ..అటు బాలీవుడ్..ఇటు టాలీవుడ్ మధ్యలో కోలీవుడ్ మూడు ఇండస్ట్రీలని ఓ రేంజ్లో ఏలేస్తుంది. అమ్మడు అందానికి స్టార్ హీరోలు సైతం ఫిదా అవుతున్నారు. కొందరు స్టార్స్ అయితే అడిగి మరీ ఆమెనే హీరోయిన్ గా సెలక్ట్ చేసుకుంటున్నారు. అంతేందుకు మొన్న ఆచార్య ఫంక్షన్ లోను చిరంజీవి పూజా తో ఓ సినిమా చేయాలని ఉంది అంటూ ఓపెన్ గానే చెప్పేశాడు.

అలాంటి రేంజ్ లో ఉంది ఆమె. అయితే పూజా హీరోయిన్ గా నటించిన లాస్ట్ మూడు చిత్రాలు..ఫ్లాప్ అయ్యాయి. ప్రభాస్ తో రాధేశ్యామ్, విజయ్ తో బీస్ట్, చరణ్ తో ఆచార్య..ఇలా వరుసగా ముగ్గురు స్టార్ హీరోలతో డిజాస్టర్ టాక్ ను అందుకుంది బుట్టబొమ్మ. అయినా కానీ పుజాని వదలటం లేదు మనవాళ్ళు. సినిమా ఫ్లాప్ అయిన ఆమె నే హీరోయిన్ గా పెట్టుకుంటున్నారు. ప్రజెంట్ పూజా చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యుల్లో పాల్గొన్న పూజా తన గురించిన ఓ షాకింగ్ విషయం అభిమానులతో పంచుకుంది.

పూజా కి బాలీవుడ్ గ్రీక్​ గాడ్ హృతిక్​ రోషన్ అంటే చాలా చాలా ఇస్టం అని చాలా ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చింది. ఆయన కెరీర్​లో సూపర్​ హిట్​గా నిలిచిన చిత్రాల్లో ఆమెకు ‘కోయీ మిల్​గయా’ అంటే చాలా ఇష్టమట . అయితే ఈ సినిమా సమయంలో పూజా 12 ఏళ్ళు ఉంటాయని.. అప్పుడు ఆయనతో ఫొటో దిగాలని చాలా ట్రై చేశానని..ఎలాగోలా ఆయనతో ఫొటో దిగాలని ప్రయత్నిస్తుంటే..సరిగ్గా అదే టైంకి హృతిక్​ స్టేజి దిగి వెళ్లిపోయారని.. దీంతో ఆ రోజు చాలా బాధపడ్డానని.. ఒక్కసారిగా నా గుండె ముక్కలైపోయినట్లుగా అనిపించింది..”అని చెప్పుకొచ్చింది. దీంతో పూజా మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.