బాలయ్య సినిమాలో మరో కత్తిలాంటి హీరోయిన్..గోపీ మామూలోడు కాదుగా..?

నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ వయసుల్లోను వరుస సినిమాలకు కమిట్ అవుతూ.. యంగ్ హీరోలకి గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..ఇరగదీసే డ్యాన్స్ స్టెప్పులతో..కేక పెట్టిస్తున్నాడు. అఖండ సినిమాతోనే కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య..ప్రజెంట్ డైనమిక్ డైరెక్టర్ గోపీ చంద్ మల్లినేని డైరెక్షన్ లో ఆయన కెరీర్ లో 107 సినిమా గా ఓ మాస్ ఎంటర్ టైనర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలయ్య సరికొత్త గెటప్ లో కనిపిస్తారన్న టాక్ వినబడుతుంది.

కాగా, బాలయ్య సినిమా లో మెయిన్ హైలెట్ గా నిలిచే ఆయన చెప్పే మాస్ డాలాగ్స్. బాలయ్య పంచె కట్టి. తొడ కొట్టి డైలాగ్ చెప్పారంటే.. ధియేటర్స్ లో ఆడియన్స్ విజిల్స్ కి సౌండ్ బాక్సులు దద్దరిల్లాల్సిందే. అంత పూనకాలు తెప్పిస్తాయి జనాలకి. ఈ సినిమాలో కూడా నందమూరి అభిమానులను మెప్పించే డైలాగ్స్ తో గోపీచంద్ సినిమా ను డైరెక్ట్ చేస్తున్నారట. ఈ సినిమాకి బాలయ్య మెయిన్ పిల్లర్ అయితే..ఆ తరువాత అంతటి ఊపుతెప్పించే పాత్ర చేస్తున్నాది స్టార్ డాటర్ వరలక్ష్మి శరత్ కుమార్. తెర పై అమ్మడు విలనిజానికి ఉన్న గుర్తింపు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ చేస్తున్నా..ఆడియన్స్ అందరూ బాలయ్య-వరలక్ష్మి శరత్ కుమార్ సీన్స్ కోసమే ఎదురు చూస్తున్నారు.

ఇక ఇలాంటీ మూమెంట్ సినిమా పై అభిమానులు పెట్టుకున్న అంచనాలని ఢబుల్ చేస్తూ.. గోపీచంద్ అదిరిపోయే క్రేజీ అప్ డేట్ ఇచ్చేందుకు రెడి అవుతున్నాడు. మనకు తెలిసిందే సినిమా లో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని..అందులో ఒక పాత్రకు హీరోయిన్ గా శృతి హాసన్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోని బాలయ్య పాత్రకు హీరోయిన్ గా హ‌నీ రోజ్ ని సెలక్ట్ చేసిన్నట్లు తెలుస్తుంది. NBK 107లో సెకండ్ హీరోయిన్‌గా మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌ను ఓకే చేశార‌నే టాక్ బయటకు వచ్చింది. హ‌నీ రోజ్.. ప‌లు మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, త‌మిళ‌, తెలుగు చిత్రాల్లో న‌టించింది. తెలుగులో కూడా మంచి మంచి సినిమాలో నటించింది కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. తెలుగులో ఆల‌యం, ఈ వ‌ర్షం సాక్షిగా చిత్రాల్లో న‌టించింది. అయితే ఇప్పుడు ఎవ్వరు ఊహించని విధంగా ఏకంగా బాల‌కృష్ణ‌తో న‌టించే అవ‌కాశాన్ని అందుకోవడం ఆమె అదృష్టమనే చెప్పాలి.

Share post:

Latest