‘అఖండ’ను ఫాలో అయిన ఆచార్య.. ఆగమైపోయాడు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో మెగాఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. కానీ ఈ సినిమా రిలీజ్ రోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా ఫ్లాప్ గా మిగలడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

అయితే ఓ విషయంలో మాత్రం ఆచార్య అఖండను ఫాలో అయ్యాడనే చెప్పాలి. ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నించే హీరోగా ఆచార్య మనకు కనిపిస్తాడు. అఖండలో కూడా నందమూరి బాలకృష్ణ అఘోరా పాత్రలో ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా నటవిశ్వరూపాన్ని చూపెట్టాడు. అయితే ఆచార్యలో ధర్మం కాన్సెప్ట్‌ను పక్కనబెట్టి ఇతర అంశాలను ప్రధానంగా చూపించడంతో ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు. కానీ అఖండలో మాత్రం ధర్మం అనే కాన్సెప్ట్‌నే ప్రధానాంశంగా చూపించడంతో ప్రేక్షకులు ఆ సినిమాలో లీనమయ్యారు.

మొత్తానికి ధర్మం అనే అంశంతో అఖండను ఫాలో అవుదామని చూసిన ఆచార్య, ఆగమైపోయాడని పలువురు కామెంట్ చేస్తు్న్నారు. చిరంజీవి కెరీర్‌లో మరో ఫ్లాప్ మూవీగా ఆచార్య మిగలడం, రామ్ చరణ్ లాంటి మేటి స్టార్ ఉన్నా కూడా ఈ సినిమాను కాపాడలేకపోవడం, కొరటాల కెరీర్‌లో ఫస్ట్ ఫెయిల్యూర్ పడటం.. ఇవన్నీ కూడా మెగాఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేశాయి.