ఆచార్య 6 డేస్ కలెక్షన్స్.. డిజాస్టర్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఏప్రిల్ 29న అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు.

అయితే ఈ సినిమాకు తొలిరోజే ఫ్లాప్ టాక్ రావడంతో ఆచార్య సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని చూపలేదు. ఇక ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి కూడా ఈ సినిమా నార్మల్ కలెక్షన్స్‌ను మాత్రమే రాబట్టింది. అయితే వీక్ డేస్‌లో ఈ సినిమాను పట్టించుకున్న వారు కూడా లేరు. ఆచార్య చిత్రానికి కొన్ని చోట్లా సింగిల్ టికెట్ కూడా సేక్ కాకపోవడంతో షోలు క్యాన్సిల్ చేశారు.

భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఆచార్య 6 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.47.71 కోట్ల వసూళ్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇది చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా మిగలడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఆచార్య 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 12.23 కోట్లు
సీడెడ్ – 6.09 కోట్లుః
ఉత్తరాంధ్ర – 4.84 కోట్లు
ఈస్ట్ – 3.24 కోట్లు
వెస్ట్ – 3.38 కోట్లు
గుంటూరు – 4.58 కోట్లు
కృష్ణా – 3.03 కోట్లు
నెల్లూరు – 2.94 కోట్లు
ఏపీ+తెలంగాణ – 40.33 కోట్ల షేర్(59 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 2.71 కోట్లు
ఓవర్సీస్ – 4.66 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 47.71 కోట్లు షేర్(74.70 కోట్ల గ్రాస్)