రాజశేఖర్ కూతురు అలా చేస్తోందా..?

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కెరీర్ ప్రస్తుతం చాలా నెమ్మదిగా సాగుతోంది. అయితే ఆయన ఫ్యామిలీ నుండి ఆయన కూతుళ్లు హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని చెక్ చేసుకుంటున్నారు. నటనాపరంగా మంచి మార్కులే పడుతున్నా, కమర్షియల్ సక్సెస్ మాత్రం వారికి రావడం లేదు. దీంతో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ ఇప్పుడు ఓ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

శివాని రాజశేఖర్ త్వరలో జరగబోయే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు రెడీ అయ్యిందట. ఈ మేరకు సోమవారం ఆమె ఫెమినా మిస్ ఇండియా ఆడిషన్స్‌కు హాజరైనట్లు తెలుస్తోంది. ఇక తనవంతుగా ఈ ఆడిషన్స్‌లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చానని శివాని పేర్కొంది. సినిమాలతో పాటు తనకు ఇలాంటి ఆఫర్ రావడం సంతోషంగా ఉందంటూ శివాని చెప్పుకొచ్చింది.

కాగా శివాని రాజశేఖర్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదు. దీంతో ఆమెకు మిస్ ఇండియా పోటీలో విజయం దక్కాలను పలువురు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అయితే తనతోపాటు ఈ పోటీల్లో పాల్గొనబోతున్న మిగతావారికి శివాని విషెస్ చెప్పడం విశేషం.

Share post:

Latest