సలార్ టీజర్.. గెట్ రెడీ అంటోన్న డైరెక్టర్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మోస్ట్ వయొలెంట్‌గా కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్2 ఇప్పుడు యావత్ సినీ ప్రేక్షకులను విస్మయానికి గురిచేయడంతో, తన నెక్ట్స్ మూవీని ఇంకెంత వయొలెంట్‌గా తెరకెక్కిస్తాడా అని అందరూ ప్రశాంత్ నీల్ గురించే చర్చించుకుంటున్నారు. కాగా సలార్‌లో ‘కేజీయఫ్’ను మించిన ఎలివేషన్స్, యాక్షన్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే సలార్ సినిమా నుండి అప్పుడే టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమా నుండి టీజర్‌ను మే నెలలో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ మేరకు ఓ అప్‌డేట్‌ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. వచ్చే వారంలో సలార్ మూవీ నుండి ఓ అదిరిపోయే అప్‌డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ మేనియాకు సిద్ధం అవ్వాల్సిందే. కేజీయఫ్ కేవలం ట్రైలర్ మాత్రమే.. సలార్ అసలుసిసలైన సినిమా అంటున్న ప్రశాంత్ నీల్, ఈ సినిమాలో ప్రభాస్‌ను ఏ రేంజ్‌లో చూపించబోతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Share post:

Latest