నా కోరిక అదే.. ప్రభాస్ చెప్పకనే చెప్పేశాడుగా..!!

ఈశ్వర్ సినిమా తో తన సినీ కెరీర్ ప్రారంభించిన ఈ రెబల్ హీరో.. నిన్న కాక మొన్న వచ్చిన రాధే శ్యామ్ సినిమా వరకు తన కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు..మరెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలల్లో నటించాడు. పడిన ప్రతి సారి ప్రభాస్..అంతకంటే ఎక్కువ స్పీడ్ గా.. డబుల్ జోష్ తో కెరీర్ లో ముందుకు సాగిపోతున్నాడు. నిజానికి రాధేశ్యామ్ సినిమా పై ప్రభాస్ అంచనాలు భారీగానే పెట్టుకున్న..అక్కడ లోపల అంత మ్యాటర్ లేదు అని.. ఫస్ట్ షో తోనే తెలిసిపోయింది.

పాపం.. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన రాధ కృష్ణను అయితే ప్రభాస్ ఫ్యాన్స్ బూతులు తిట్టారు. మా హీరొతో ఇంత చెత్త సినిమా తీస్తావా అంటూ మండిపడ్డారు. ఫైనల్ గా ఆ తిట్లకు ఫుల్ స్టాప్ పడినా..ఇప్పుడు ప్రభాస్ అభిమానులు అంతా కూడా వెయిట్ చేసేది సలార్ సినిమా గురించే. కనీసం ఈ సినిమా తో నైనా హిట్ కొట్టవయ్యా సామీ అంటూ ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ క్రమంలో నే ప్రభాస్ తన ముందు చిత్రం రాధే శ్యామ్ ఫలితంపై..రాబోతున్న చిత్ర సలార్ పై స్పందించిన్నట్లు మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ కి బాహుబలి లాంటి సినిమాలు చేయడం ఇష్టమేనట. కానీ ఎప్పుడు అలాంటి జోనర్ లోనే సినిమాలు తీసుకుంటూపోతే..బోర్ గా ఉంటుందని..తనకి కొత్తగా సరికొత్తగా ఉండే స్టోరీస్ లో నటించాలని..చిన్నప్పటి నుండి ఓ కోరిక ఉండేదట. అందుకే కొంచెం కొత్తగా ఢిఫరెంట్ గా లవ్ స్టోరీలు చేద్దామని రాధేశ్యామ్ ట్రై చేశారట. జనాలకు నన్ను లవ్ స్టోరీలో చూడటం నచ్చలేదో..లేక స్టోరీనే నచ్చలేదో ..లేదా ఆ స్క్రిప్టులోనే ఏదైనా లోపం కూడా ఉండి ఉండొచ్చు అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ తన ఆశలని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ పైనే పెట్టుకుని ఉన్నారు. మరి ప్రభాస్ కి ఈ సినిమా ఎలాంటి విజయం అందిస్తుందో వేచి చూడాల్సిందే..!!

Share post:

Popular