పవన్ సినిమాలో సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ ఎవరూ ఊహించిన ఓ సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. పేదల పాలిట దువుడిగా, ఉన్నవారి వద్ద దోచుకుని పేదలకు పంచిపెట్టే పాత్రలో పవన్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుందట. ఇక ఈ సినిమాలో పవన్ చేయబోయే యాక్షన్ స్టంట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పాలి. ఆయన పలు మార్షల్ ఆర్ట్స్ రిహార్సల్ చేస్తున్న ఫోటోలు ఇప్పటికే ఈ సినిమా యూనిట్ రివీల్ చేసింది.

ఇక ఈ సినిమాలో పవన్ ఇవ్వబోయే ఆ సర్‌ప్రైజ్ ఏమిటా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కథానుసారంగా ఈ సినిమాలో పవన్ చిన్నతనంలో కొన్ని కీలక సీన్స్ ఉండబోతున్నాయి. అయితే పవన్ చిన్నతనం పాత్రలో ఆయన కొడుకు అకీరా నందన్ కనిపిస్తాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తమ అభిమాన హీరో కొడుకు ఇలా పవన్ సినిమాలో ఎంట్రీ ఇస్తుండటం తమకు సంతోషంగా ఉందని వారు అంటున్నారు. మరి నిజంగానే అకీరా నందన్ ఈ సినిమాలో నటిస్తాడా లేడా అనేది తెలియాల్సి ఉంది.

Share post:

Latest