కొరటాల కోసం కొత్తగా ప్లా్న్ చేస్తోన్న తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో మరో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు హీరోల పర్ఫార్మెన్స్‌లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కాగా ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తారక్, ప్రస్తుతం భక్తిమార్గంలోకి వెళ్లాడు.

తారక్ ప్రస్తుతం హనుమాన్ దీక్షలో ఉన్నాడు. ఇక ఈ దీక్ష ముగియగానే తారక్, తన కెరీర్‌లో 30వ సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతాడట. అయితే ఈ సినిమా కోసం తారక్ మరోసారి వెయిట్ తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తారక్ అల్ట్రా స్లిమ్ లుక్‌లోకి రాబోతున్నాడట. దీనికోసం మరోసారి హెవీ వర్కవుట్స్ చేసేందుకు తారక్ ప్లాన్ చేస్తున్నాడట. హనుమాన్ దీక్ష ముగించిన వెంటనే ఈ వర్కవుట్స్ చేసేందుకు తారక్ సిద్ధమవుతుండగా, కొరటాల శివతో మూవీని జూన్ రెండో వారంలో పట్టాలెక్కించాలని చూస్తున్నాడట.

ఈ లెక్కన మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో.. తారక్ వద్ద ఎక్కువగా వర్కవుట్స్ చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు. అయితే తాను అనుకున్నట్లుగానే ఈ సినిమా కోసం ఎక్స్‌ట్రా హార్డ్ వర్క్ చేసేందుకు రెడీగా ఉన్నాడట. ఇక కొరటాల శివ ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించనుండగా, ఈ సినిమాలో ఓ బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్‌గా తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Share post:

Popular