ఆచార్యకు కాజల్ ఝలక్.. అట్లుంటది మనతోని!

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మరికొన్ని గంటల్లో మనముందుకు రాబోతోంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాలీ శివ దాదాపు నాలుగేళ్ల నుండి తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ఎన్నో కష్టాల తరువాత ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా కాజల్‌ను తీసుకుని, ఆమెపై కొన్ని షాట్స్ కూడా షూట్ చేశారు.

అయితే కాజల్ గర్భవతి కావడంతో, ఆమె షూటింగ్‌లో పాల్గొనలేకపోయింది. దీంతో చిత్ర యూనిట్ చేసేదేమీ లేక, ఆమె పాత్రను ఈ సినిమా నుండి పూర్తిగా లేపేశారు. అంటే, ఈ సినిమాలో కాజల్ మనకు ఎక్కడా కనిపించదు. ఇక చిరంజీవి కూడా హీరోయిన్ లేకుండానే సోలోగా కనిపిస్తాడు. అయితే కాజల్ తన పాత్రను రిమూవ్ చేశారనే విషయం తెలుసుకుని ఏమాత్రం ఫీల్ కాలేదట.

కానీ తనకు రావాల్సిన రెమ్యునరేషన్‌ను అణాపైసలతో సహా వసూలు చేసుకుందట. ఆచార్య సినిమా కోసం కేవలం 5 రోజులు మాత్రమే పని చేసిన కాజల్ ఏకంగా రూ.1.5 కోట్లు రెమ్యునరేషన్‌గా పుచ్చుకుందట. ఏదేమైనా ఇది ఆమె ట్యాలెంట్ అంటున్నారు పలువురు సినీ విమర్శకులు. మొత్తంగా ఆచార్యకు కేవలం 5 రోజులు పనిచేసి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఎగరేసుకుపోయిన కాజల్ గట్టి ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి.

Share post:

Latest