అమ్మ ఒడిపై అన‌వ‌స‌ర రాద్ధాంతం…!

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న అనేక ప‌థ‌కాల్లో అమ్మ ఒడి ప‌థ‌కం కూడా ఒక‌టి. నిజా నికి అన్ని ప‌థ‌కాల కంటే.. కూడా.. మ‌హిళ‌ల్లో వైసీపీకి, జ‌గ‌న్‌కు భారీ ఇమేజ్‌ను సొంతం చేసిన ప‌థ‌కం కూ డా ఇదే. 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న ఈప థ‌కాన్ని.. వ‌రుస‌గా రెండు సంవ‌త్సరాలు విజ‌య‌వం తంగా అమ‌లు చేశారు. ఈ ప‌థ‌కం కింద‌.. రూ.15000ల‌ను బిడ్డ‌ల‌ను పాఠ‌శాల‌ల‌కు పంపించే త‌ల్లుల‌కు ఇస్తున్నారు. తొలి ఏడాది రూ.15000 ఇచ్చిన ప్ర‌బుత్వం ఒక వెయ్యి రూపాయ‌ల‌ను మాత్రం పాఠ‌శాల‌లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు విరాళంఇవ్వాల‌ని కోరింది.

అయితే.. పెద్ద‌గా ఎవ‌రూ స్పందించ‌లేదు. దీంతో త‌నే గ‌త ఏడాది ఇచ్చిన రూ.15000ల‌లో ఒక వెయ్యి మిన హాయించుకుని.. నిధులు ఇస్తోంది. ప్ర‌తి ఏటీ జ‌న‌వ‌రిలో ఇస్తున్న ఈ ప‌థ‌కాన్ని తాజాగా జూలైలో మార్చా రు. ఈ క్ర‌మంలో కొన్ని నిబంధ‌న‌లు కూడా విధించారు. విద్యార్థులు క్ర‌మం త‌ప్ప‌కుండా హాజ‌రు కావాల్సిం దే. త‌ల్లిదండ్రులు.. ప‌రిమిత ఆదాయం ఉన్న‌వారు ఉండాలి. ఇక‌, 300 యూనిట్ల‌కు మించి విద్యుత్ వినియోగించ‌ని వారు కావాలి. ఇలా.. కొన్ని కీల‌క నిబంధ‌న‌లు ఉన్నాయి.

అయితే.. వీటిపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది. ష‌ర‌తులు పెట్టి.. ప‌థ‌కాన్ని పేద‌ల‌కు దూరం చేస్తున్నార‌ని.. మండిప‌డింది. 300 యూనిట్లు ప‌రిమితి ఎందుకు పెట్టార‌ని.. టీడీపీ నా యకులు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. దీనిని మేధావులు త‌ప్పుబ‌డుతున్నారు. చిన్న స్థాయి ప‌థ‌కాల‌కే అనేక ష‌రుతులు పెడుతున్న ప‌రిస్థితి దేశంలో ఉంద‌ని.. మ‌రి ఎక్కువ మందికి భారీ మొత్తంలో ల‌బ్ధి చేకూర్చే ఈ ప‌థ‌కానికి ఎందుకు త‌ప్పులు వెదుకుతున్నార‌ని.. వారు ప్ర‌శ్నిస్తున్నారు.

పైగా.. 300 యూనిట్ల విద్యుత్ వ‌ల్ల‌.. న‌ష్ట‌పోయేది ఏమీ లేదని చెబుతున్నారు. పైగా ల‌బ్ధిదారుల సంఖ్య కూడా పెరుగుతుంద‌న్నారు. ప్ర‌తిదాన్నీ అన‌వ‌స‌ర యాగీ చేసి.. రాజ‌కీయ మైలేజీ కోసం ప్ర‌య‌త్నిస్తే. న‌ష్టం వ‌స్తుంద‌ని చెబుతున్నారు.. మ‌రి.. టీడీపీ నేత‌లు.. ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా ప్ర‌తి విష‌యా న్నీ.. రాజ‌కీయం చేయాల‌ని అనుకోవ‌డం.. ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని అంటున్నారు.