ఆచార్య ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదేనా..?

మెగా అభిమానులతో పాటు బడా సెలబ్రిటీలు కూడా ఎప్పుడెప్పుడా అంటూ వెయ్యి కళ్లతో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య ..ఎట్టకేలకు గ్రాండ్ గా ధియేటర్స్ లో కొద్ది గంటల ముందే రిలీజ్ అయ్యింది. మా అభిమాన హీరోని ఎలా చూపిస్తారో కొరటాల అని ఈగర్ గా వెయిట్ చేసిన అభిమానుల ఆశలను నిరాశ పరుస్తూ.. డైరెక్టర్ ఊహించని షాక్ ఇచ్చాడు. హీరో ఎంట్రీలో అసలు పసలేదు. మెగా హీరో ఎంట్రీ అంటే ఎలా ఉండాలి.. ధియేటర్ పై బొమ్మ పడితే .. గూస్ బంప్స్ రావాలి.. సీట్లో కూర్చున్న అభిమాని లేచి గొంతు చించుకుని అరవాలి..అది మెగాస్టార్ రేంజ్ అంటే.

కానీ ఇక్కడ కొరటాల సాదా సీదా గా మెగా హీరో ఎంట్రీని ఫినిష్ చేశాడు. పోనీ సినిమా లో కామెడీ ఉందా..అది లేదు. రొమాంటిక్..అబ్బే ఆ ఊసే లేదు. కధ పరంగా కూడా పెద్దగా చెప్పుకొవాల్సిన రేంజ్ లో లేదు.. ఏదో నేను మెగా హీరోతో సినిమాలు చేశాను అని అనిపించుకోవడానికి సినిమా తీసిన్నట్లు ఉన్నారే కాని..కసి మీద పట్టుదలతో తీసిన్నట్లు కనిపించడం లేదు అంటూ నెటిజన్స్ అంటున్నారు. పూజా హెగ్డే అందాలను వాడుకోవడం లో కూడా కొరటాల ఫెయిల్ అయ్యాడు. ఆమె కేవలం చరణ్ పాత్ర కోసం ఇరికించిన ఓ ఐటెం లా కనిపిస్తుంది సినిమాలో.

కొరటాల సినిమా ఎంత డిజాస్టర్ అంటే ..సినిమా చూసిన కొద్దిసేపటికే జనాలకు తలనొప్పి వచ్చి బయటకు వచ్చేస్తున్నారట. ఎందుకంటే అది మెగా హీరోలతో తీయ్యాల్సిన సినిమాకాదు. కొరటాల ముందు సినిమాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చూడటానికి వెళ్లితే కష్టం..ఆ రీచ్ ఆయన అందుకోలేరు. మెగా ఫ్యాన్స్ అంటూ చెప్పుకునే వాళ్లు లైక్ చేయాల్సిందే తప్పా.. ఈ సినిమా ని ఇష్టపడటానికి..ఆతృతగా చూడటానికి ..అక్కడ ఏం లేవు. మణిశర్మ సంగీతం కూడా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ఇంతటి నెగిటీవ్ టాక్ తెచ్చుకోవడానికి కారణం..కధలో బలం లేకపోవడం..ఆ కధ మెగా హీరోలకి సూట్ కాకపోవడం అంటున్నారు సినిమా చూసిన జనాలు. మరి చూడాలి కలెక్షన్స్ పరంగా ఎలా నెట్టూకొస్తుందో..?