‘ఆచార్య’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. మిక్స్‌డ్ టాక్‌తో కుమ్మేసిందిగా…!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా బ్లాక్‌బ‌స్ట‌ర్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా ఆచార్య‌. మూడేళ్ల నుంచి ఊరిస్తూ వ‌స్తోన్న ఈ సినిమా ఎట్ట‌కేల‌కు నిన్న ప్ర‌పంచ వ్యాప్తంగా 2 వేల థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నా… సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది.

టాక్ వీక్‌గా ఉన్నా కూడా ఫ‌స్ట్ డే ఏపీ, తెలంగాణ‌లో వ‌సూళ్లు కుమ్మేసింది. ఫ‌స్ట్ డే ఆచార్య జీఎస్టీతో క‌లిపి రు. 33 కోట్ల షేర్ రాబ‌ట్టింది. టాక్‌తో కంపేరిజ‌న్ చేసి చూసుకుంటే ఇది మంచి ఫిగ‌రే అని చెప్పాలి. రామ్‌చ‌ర‌ణ్ – చిరు కాంబోలో వ‌చ్చిన తొలి సినిమా కావ‌డంతో పాటు పూజా హెగ్డే లాంటి క్యూట్ హీరోయిన్‌… ఇటు కొర‌టాల శివ డైరెక్ష‌న్ కావ‌డంతో సినిమాకు తొలి రోజు టాక్‌తో సంబంధం లేకుండా మంచి ఫిగ‌ర్స్ వ‌చ్చాయి.

ఇక నైజాంలో ఈ సినిమాను వ‌రంగ‌ల్ శ్రీను పంపిణీ చేశారు. అక్క‌డ రు. 8 కోట్ల‌కు పైగా డీసెంట్ షేర్ అందుకుంది. ఇక చిరుకు ప‌ట్టున్న కృష్ణ‌, గుంటూరుతో పాటు గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర‌లోనూ ఆచార్య‌కు తొలి రోజు మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి. ఏరియాల వారీగా ఫ‌స్ట్ డే ఆచార్య వ‌సూళ్లు ఇలా ఉన్నాయి..

నైజాం – 7.90 కోట్లు
సీడెడ్ – 4.60
ఉత్త‌రాంధ్ర – 3.61
ఈస్ట్ – 2.53
వెస్ట్ – 2.90
గుంటూరు – 3.76
కృష్ణా – 1.90
నెల్లూరు – 2.30
——————————
ఏపీ + తెలంగాణ = 29.50 షేర్‌
గ్రాస్ వ‌సూళ్లు = 40 కోట్లు
———————————-

ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఆచార్య‌కు రు. 131 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఏపీ, తెలంగాణలోనే రు. 107 కోట్ల బిజినెస్ జ‌రిగింది. మ‌రి ఈ టాక్‌తో ఈ రేంజ్‌లో వ‌సూళ్లు రాబ‌డుతుందా ? అన్న సందేహాలు అయితే ఉన్నాయి.