ఖచ్చితంగా సీఎం అవుతాడు..టాలీవుడ్ ని ఏలబోతున్న కింగ్ ఎన్టీఆర్..జాతకంలో ఏముందంటే..!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి తారకరామారావు గారు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అటు సినిమాలోను-ఇటు రాజకీయాల్లోను తనదైన స్టైల్ లో రాణిస్తూ..ఆయనకంటూ ఓ సపరేటు ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక ఆయన మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జూ. ఎన్టీఆర్ కూడా..తాతకు తగ్గ మనవడిగా మంచి మంచి సినిమాలు చేస్తూ..టాలీవుడ్ టాప్ హీరోల లిస్ట్ లో ఉన్నాడు.

రీసెంట్ గా తారక్ నటించిన ఆర్ ఆర్ ఆర్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన క్యారెక్టర్, స్క్రీన్ స్పేష్ చిన్నదే నైనా..నటనలో మాత్రం అస్సలు తగ్గలేదు, ముఖ్యంగా ఆ ఎక్స్ ప్రేషన్స్ ..చాలా బాగా పలికించాడు. కాగ, సినిమాల పరంగా నెం 1 గా దూసుకుపోతున్న ఈయన రాజకీయాలోకి వచ్చి..ఆయన తాతగారు స్దాపించిన పార్టీని ప్రస్తుత పరిస్ధితుల నుండి కాపాడాలని పలువురు టీడీపీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తారక్ రాజకీయాలోకి వచ్చి..టీడీపీ బాధ్యతలు తీసుకోవాలని పలువురు రాజకీయ నాయకుల కోరిక కూడా.. కానీ తారక్ మాత్రం దానికి సిద్ధంగా లేరు.

ఎప్పుడు తన రాజకీయ ఎంట్రీ గురించి అడిగినా..మాట దాటేస్తూ..దానికి ఇప్పుడు సమయం కాదు అంటూ చెప్పుకొచ్చేవారు. అయితే రీసెంట్ గా ఆయన జాతకం చూసిన ప్రముఖ జోతిష్యులు నందిభట్ల శ్రీహరి శర్మ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పుకొచ్చారు. సినిమాల పరంగా తారక్ కి తిరుగులేదని..2033 వరకు టాలీవుడ్ నెం 1 హీరో ఆయనేనని. ఇక ఆయన జాతకం ప్రకారం ఆ తరువాత 2034 లో అనుకోని పరిస్ధితుల కారణంగా తారక్ రాజకీయాలోకి వస్తారు అని..చెప్పుకొచ్చారు. దీంతో నందమూరి అభిమానులు మరోసారి #CMNTR అంటూ ట్రెండ్ చేస్తున్నారు. తారక్ రాజకీయాలోకి ఎంటర్ అయితే వార్ వన్ సైడ్ అయిపోది అంటూ సినిమాటిక్ డైలాగ్స్ చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి ఏం జరగబోతుందో..?

Share post:

Popular