బ్రేక్ కోసం వైజాగ్ వెళ్తున్న ఏజెంట్!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని ఇంపార్టెంట్ సీక్వె్న్స్‌లను ఇంకా షూట్ చేయాల్సి ఉండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గా్ల్లో వినిపిస్తోంది. ఈ సినిమా కోసం అఖిల్ భారీగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్తోంది ఈ చిత్ర యూనిట్.

తాజాగా వైజాగ్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ అక్కడికి చేరుకుందట. ఇక్కడ చిత్రీకరించే భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వస్తుందని, ఇందులో అఖిల్ కొన్ని అమేజింగ్ స్టంట్స్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అదిరిపోయే సిక్స్ ప్యాక్ బాడీతో అఖిల్ చేసే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక పూర్తిగా స్పై థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఏజెంట్ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తనదైన టేకింగ్‌తో తెరకెక్కిస్తుండగా, అఖిల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మేజర్ అట్రాక్షన్‌గా నిలవనుంది. కాగా ఈ సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తోండగా, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు అత్యద్భుతమైన సంగీతం ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఆగస్టులో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో అఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Share post:

Latest