పూరీతో కొత్త మిషన్ లాంఛ్ చేస్తున్న విజయ్ దేవరకొండ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా అంచనాలను రెట్టింపు చేశాయి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్ పాత్రలో మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు.

కాగా ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా తెరకెక్కించేందుకు అప్పుడే రెడీ అయ్యాడు. ఈ క్రమంలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లాంఛ్ గురించి విజయ్ దేవరకొండ ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశాడు. తన నెక్ట్స్ సినిమాను 29 మార్చి 14.20 గంటలకు అనౌన్స్ చేస్తున్నట్లు ఓ పోస్టర్‌ను వదిలాడు ఈ రౌడీ హీరో. ఈ సినిమాను కూడా దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు.

ఇక ఈ సినిమాను పూర్తిగా సరికొత్త కథతో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రచాలా కొత్తగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. అటు ఈ సినిమా కోసం పూరీ ఎలాంటి కథను రెడీ చేశాడా అని అందరూ ఆస్తిగా చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మిగతా నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు తెలియాల్సి ఉంది.

Share post:

Latest