త్రివిక్రమ్‌పై దారుణమైన ట్వీట్‌.. డైరెక్టర్ మాటలకు అంతా షాక్..!!

సినీ ఇండస్ట్రీలో ఉండే పెద్దవాళ్ళ పై నెట్టింట ట్రోలింగ్ జరగడం చాలా కామన్ గా కనిపిస్తుంది. నేటి సోషల్ మీడియా యుగంలో ప్రతి దాని పై నెగిటీవ్ గా చూడటం అందరికి అలవాటు అయిపోయిన్నట్లుంది . ముఖ్యంగా సినీ సెలబ్రిటీలంటే..జనాల్లో చిన్న చూపు ఎక్కువైంది. వాళ్ళనే టార్గెట్ చేస్తూ..ప్రతి రోజు నెట్టింట ఏదో ఒక ఇష్యూ హాట్ టాపిక్ గా ట్రెండ్ చేస్తున్నారు జనాలు.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ పై..దారుణంగా కామెంట్ చేశాడు. దీనికి మరో డైరెక్టర్ అద్దిరిపోయే రిప్లై ఇవ్వడంతో మ్యాటర్ చిలికి చిలికి గాన వానగా తయారైంది. ఓ ప్రముఖ వెబ్ సైట్..త్రివిక్రమ్‌ శ్రీనివాస్ గురించి ఆర్టికల్ రాస్తూ..”అప్పుడెప్పుడో రిలీజైన ‘అల వైకుంఠపురంలో’ మూవీ తర్వాత.. త్రివిక్రమ్‌ ఏ చిత్రానికి కూడా డైరెక్టర్ గా వర్క్ చేయలేదు అయినా కానీ ఆయన ఈ గ్యాప్ లోనూ . 50 కోట్లు సంపాదించాడు” అంటూ ఒక వార్త రాసుకొచ్చింది.

ఇక ఈ వార్త పై కామెంట్ చేస్తూ ఓ నెటిజన్ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. ” ఇదిరా లైఫ్‌ అంటే..” అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. ఇది చదివినా చాలా మంది త్రివిక్రమ్‌ అభిమానులకు కోపం వచ్చింది. కానీ కొందరు మనకు ఎందుకులే అన్నట్లు సైలెంట్ అయ్యారు. కానీ డైరెక్టర్ సాయి రాజేష్‌ మాత్రం అలా చూస్తూ వదిలేయలేదు. గట్టిగా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చి..అసలైన నిజాలు రివీల్ చేశాడు. ఆయన రిప్లై ఇస్తూ.. ” ఆయనకి ఇవేమి ఊరికే రాలేదు. రూ. 1500లతో రూమ్‌ షేర్‌ చేసుకుని, 50కిపైగా మూవీస్‌కి రైటర్‌గా పనిచేశాడు. ఫస్ట్ సినిమా బ్రేక్ కోసం దాదాపు పదేళ్లు ఎంతో కష్టపడి ఎదురుచూసిన తరువాతే అతనికి ఈ గుర్తింపు లభించింది అని సమాధానమిచ్చాడు. దీంతో ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Share post:

Latest