రాధేశ్యామ్ 10 డేస్ క‌లెక్ష‌న్స్‌… ఇండియాలోనే బిగ్గెస్ట్ రికార్డ్‌..!

రిలీజ్‌కు ముందు నుంచే రాధేశ్యామ్ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌చ్చ‌న్న సందేహాలు ఎక్కువుగా ఉన్నాయి. తీరా రిలీజ్ అయ్యాక ఆ అంచ‌నాలే నిజం అయ్యాయి. రాధేశ్యామ్‌కు తొలి రోజే మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. ఇక ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే స‌రికే డిజాస్ట‌ర్ అని ఫిక్స్ అయ్యారు. ఫ‌స్ట్ వీక్ వ‌సూళ్లు ముగిసే సరికి ఘోర‌మైన టాక్ వ‌చ్చేసింది. ఇదో ల‌వ్ స్టోరీ కావ‌డంతో పాటు ప్ర‌భాస్ ఇమేజ్‌కు త‌గిన‌ట్టుగా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ లేక‌పోవ‌డం సినిమాకు మైన‌స్ అయ్యింది.

అయితే విజువ‌ల్స్ మాత్ర‌మే గ్రాండియ‌ర్‌గా ఉన్నాయ‌ని.. క‌థ‌, క‌థ‌నాలు లేవ‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక ఈ సినిమా 10 రోజుల ర‌న్ పూర్తి చేసుకుంది. 10 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 53.82 కోట్ల షేర్, రూ. 84.00 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవరాల్ వరల్డ్‌వైడ్‌గా రూ. 82.25 కోట్ల షేర్, రూ. 149 కోట్ల గ్రాస్ వచ్చినట్టు తేలింది. ఓ ఫాన్ ఇండియా సినిమాకు ఇవి చాలా త‌క్కువ వ‌సూళ్లే అని చెప్పాలి.

వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రూ. 202.80 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ లెక్కన రాధేశ్యామ్ బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే మ‌రో రు. 120 కోట్ల షేర్ రాబ‌ట్టాలి. ఇది జరిగే ప‌నికాదు. ఈ లెక్క‌న రాధేశ్యామ్ ఇండియా వైజ్ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ సినిమాల‌లో ఒక‌టిగా నిలిచింది.

ఏరియాలవారీగా 10 రోజుల కలెక్షన్స్
నైజాం: 24.69
సీడెడ్: 7.42
ఉత్తరాంధ్ర: 4.83
ఈస్ట్ గోదావరి: 4.31
వెస్ట్ గోదావరి: 3.31
గుంటూరు: 4.47
కృష్ణా: 2.66
నెల్లూరు: 2.13
—————————————–
ఏపీ+తెలంగాణ: రూ. 53.82 కోట్లు
—————————————–
కర్ణాటక: 4.22
తమిళనాడు: 0.78
కేరళ: 0.18
హిందీ: 10.25
రెస్టాఫ్ ఇండియా: 1.66
ఓవర్సీస్: 11.34
——————————————-
టోటల్ వరల్డ్‌వైడ్: రూ. 82.25 కోట్లు
——————————————–