ప్రభాస్ “రాధేశ్యామ్” ఫస్ట్ ప్రీమియర్ షో ఈ థియేటర్‌లోనే..!

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజాహెగ్డే హీరో ,హీరోయిన్గా నటించిన సినిమా రాధే శ్యామ్ . ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీ. యూవీ క్రియేషన్స్ పతాకంపై రాధే శ్యామ్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రాధే శ్యామ్ విడుదల కాబోతుంది. ఈ సినిమాకి రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ ఇప్పటికే బుకింగ్ అయ్యాయి .

అయితే అసలు విషయం ఏమిటంటే హైదరాబాద్‌లో “రాధేశ్యామ్” మొట్టమొదటి ప్రీమియర్ షో ఎక్కడో తేలిపోయింది.అదేనండి కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో బెనిఫిట్ షో ఉండబోతుందని, ఇక్కడి నుంచే “రాధేశ్యామ్”ని మీ ముందుకు తీసుకొస్తామని శ్రేయాస్ మీడియా సంస్థ తెలిపింది.

Share post:

Latest