అక్కడ రాధేశ్యామ్ ప్యాకప్..?

యంగ్ రెబల్ స్టార ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందు ఎలాంటి భారీ హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తరువాత సీన్ రివర్స్ అయ్యింది. రాధేశ్యామ్ చిత్రం కాస్త సోది చిత్రంగా ప్రేక్షకుల్లో నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలింది. రిలీజ్ రోజునే ఈ సినిమాను ఆడియెన్స్ రిజెక్ట్ చేశారు.

ఇక ఈ సినిమా కోసం ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ సినమాలో మ్యాటర్ లేదని తేలిపోవడంతో, అక్కడి జనం ఈ సినిమావైపు కన్నెత్తి కూడా చేడటం లేదు. దీంతో గతకొద్ది రోజులుగా ఓవర్సీస్‌లో ఈ సినిమాకు దారుణమైన కలెక్షన్లు వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యూఎస్‌లో ఈ సినిమాను చూసేందుకు జనం ఎవరూ రాకపోవడంతో, చాలా వరకు థియేటర్లలో ఈ సినిమా రన్‌ను నిలిపివేశారట. ఇక మరో రెండు రోజుల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ కానుండటంతో, ఇప్పుడు పూర్తిగా యూఎస్ నుండి రాధేశ్యామ్ చిత్రాన్ని ఎత్తేసినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ కెరీర్‌లో భారీ డిజాస్టర్‌గా రాధేశ్యామ్ నిలిచిపోవడంతో చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులు కూడా నిరాశకు లోనవుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఏదేమైనా ఓవర్సీస్‌లో మంచి క్రేజ్ ఉన్న ప్రభాస్‌కు ఇలాంటి అవమానం మునుపెన్నడూ జరగలేదని ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు. మరి సినిమాలో దమ్ములేకపోతే, ఏ హీరో పరిస్థితి అయినా ఇంతే కదా అంటున్నారు కామన్ ఆడియెన్స్.

Share post:

Popular