రాధేశ్యామ్ దెబ్బకు అతడినే నమ్ముకున్న ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇటీవల భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ కావడం, సినిమాలో దమ్ములేకపోవడంతోనే ఇలాంటి ఫలితం వచ్చిందని ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఉండాల్సిన అంశాలు ఏ ఒక్కటి కూడా ఈ సినిమాలో లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు సినీ క్రిటిక్స్.

ఏదేమైనా రాధేశ్యామ్ చిత్రం అటు ప్రభాస్‌కు ఇటు ఆడియెన్స్‌కు ఓ గుణపాఠంగా నిలిచిందని అంటున్నారు. ఇకపై తన సినిమాలో ఏమేమి ఉండాలో ప్రభాస్ జాగ్రత్తగా చూసుకుంటాడు. అటు ఆడియెన్స్ కూడా వచ్చిన ప్రతి సినిమాను బాహుబలితో పోల్చకుండా ఉంటారు. అయితే ఇలాంటి భారీ డిజాస్టర్ తరువాత ప్రభాస్ ఇప్పటికే కమిట్ అయిన బడా చిత్రాలకంటే ముందుగా, ఓ చిన్న సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకుడు మారుతితో ఓ చిన్న సినిమాను ప్లాన్ చేశాడు.

అయితే రాధేశ్యామ్ ఎఫెక్ట్‌తో తొలుత ప్రభాస్ ఈ సినిమాను వద్దన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ మారుతి చెప్పిన కథ చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్‌గా ఉండటంతో ప్రభాస్ ఈ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కథే హీరో కావడం మరో విశేషం కావడంతో ప్రభాస్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడట. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 10న అఫీషియల్‌గా లాంఛ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ సినిమా సక్సె్స్ విషయంలో ప్రభాస్ కేవలం దర్శకుడు మారుతిపైనే భారం వేశాడని, రాధేశ్యామ్ దెబ్బకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా తమ హీరోకు మరో బ్లాక్‌బస్టర్ హిట్ వెంటనే పడాలని వారు కోరుతున్నారు.

Share post:

Latest