క‌న్నీళ్లు పెట్టుకున్న రాధేశ్యామ్ డైరెక్టర్ భార్య.. ప్రభాస్ చేసిన పనికి షాక్..!!

బ్రహ్మ రాసిన రాతన ఆ బ్రహ్మ నే చెడుపలేడు అంటూ మన పెద్ద వాళ్ళు ఎప్పుడు చెప్పుతుంటారు గుర్తుందా..అదే జరిగింది ప్రభాస్ విషయంలో. ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజైన చిత్రం “రాధేశ్యామ్”. దాదాపు 300 కోట్లు ఖర్చు చేసి.. పోరుగు దేశాలకు వెళ్లి అక్కడ కోట్లకి కోట్లు పోసి పాటలు షూట్ చేసారు. కానీ ప్రయోజనమే లేకుందా పోయింది. కధలో బలం లేనప్పుడు కోట్లు పోసినా కూడా వేస్ట్ అని మరోసారి ప్రూవ్ అయ్యింది. “రాధేశ్యామ్” బాక్స్ ఆఫిస్ వద్ద బొల్తా కొట్టింది. భారీ అంచనాల నడుమ మార్చి 11న రిలీజ్ అయినా ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది .

ఇంకేముంది..పాపం సినిమా లో హీరోగా నటించినందుకు ప్రభాస్ ని..మా ప్రభాస్ చేత ఇలాంటి చెత్త సినిమా తీస్తావా అని సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ ని ఇద్దరిని నెట్టింట ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయ్య బాబోయ్ ఆ మీమ్‌స్ చూస్తే నవ్వు ఆగదు అలా చేశారు ట్రోల్స్. అయితే సినిమా ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారంటూ డైరెక్టర్ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. సినిమా రిలీజ్ తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన..సినిమా తరువాత ప్రభాస్ ని మీట్ అయ్యే అవకాశమే లేకుండా పోయింది. ఆయన విదేశాలకి వెళ్లిపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు.

“కానీ, ఫోన్లో టచ్ లోనే ఉన్నాడు. సినిమా గురించి ప్రభాస్ మాట్లాడుతూ..సినిమా కధని నా ఇమేజ్ బాగా డామినేట్ చేసింది. అందుకే ఫ్యాన్స్ కు నచ్చలేదు. కొందరు జనాలకి నచ్చినా ఎందుకు ఇంత నెగిటివిటీ వస్తుందో అర్ధం కావట్లేదు అంటూ చాలా ఎమోష‌న‌ల్‌గా మెసేజ్‌లు పెడుతున్నార‌ని” రాధాకృష్ణ తెలిపాడు. అంతేకాదు..సినిమా బాగుందని తన సన్నిహితులు చెప్పుతున్నారని..ముఖ్యంగా ఈ సినిమా చూసి వచ్చక తన భార్య సినిమాలోని కొన్ని ఎమోషన్స్ సీన్స్ చూసి ఏడ్చేసిందని చెప్పుకొచ్చాడు. సినిమా విషయంలో ది బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చింది తన భార్యనేనట. సినిమాకు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ త‌న నుంచే అని రాధాకృష్ణ చెప్పాడు. దీని పై అభిమానుల రియాక్షన్ వేరేలా ఉంది. నిజానికి ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు ప్రభాస్ అస్సలు నీ పై కోపడాలి కానీ డార్లింగ్ మంచోడు..అందుకే నీతో మెసేజ్ లో అయిన టచ్ లో ఉన్నాడు అంటూ డైరెక్టర్ పై మండిపడుతున్నారు. అసలు ప్రభాస్ ఈ సినిమా కి ఎలా ఒప్పుకున్నాడి తెలియడం లేదని..డార్లింగ్ ఇలాంటి సినిమాకి సైన్ చేసి మాకు పెద్ద షాక్ ఇచ్చాడని” అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Share post:

Latest