పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఈయన `రాధేశ్యామ్`తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా లేకపోయినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా అదరగొట్టేస్తోంది. ఇకపోతే ప్రభాస్ చేతిలో నాలుగు పెద్ద సినిమాలు ఉంటున్నాయి. అందులో `ఆదిరుపురుష్` చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది.
అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న `సలార్`, నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న `ప్రాజెక్ట్-కె` చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే మరో మూవీని పట్టాలెక్కించనున్నాడు. అయితే ఇవేమి ఇంకా పూర్తి కాకుండానే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని జోరుగా వార్తలు వస్తున్నాయి.
దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా.. ప్రభాస్-మారుతి కాంబో కన్ఫార్మ్ అయినట్లు బలంగా టాక్ వినిస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. `రాజా డీలక్స్` అనే టైటిల్ పరిశీలనతో ఉండగా.. ఈ మూవీలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనువిందు చేయనున్నారని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం కోసం సెట్లు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభాస్ ఇంటి సెట్‌ను హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలతో రియలిస్టిక్‌గా తీర్చిదిద్దుతున్నారట. దీని కోసం మేకర్స్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 5 కోట్లు బడ్జెట్ పెడుతున్నారట. ఇందులో ఎంత వరకు నిజముందో తెలీదు గానీ.. ఈ వార్త సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారింది. దీంతో ప్రభాస్ ఇంటి సెట్ కోసమే అన్ని కోట్లా అంటూ నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.