రాధేశ్యామ్ ఫెయిల్యూర్‌పై పూజా కామెంట్.. ఏమందంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ రాధేశ్యామ్ ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాపై ఆడియెన్స్ అంచనాలు ఓ రేంజ్‌లో పెట్టుకోవడం, సినిమాలో దమ్ము లేకపోవడంతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యింది. ఫలితంగా ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది.

ఇక ఈ సినిమాకు అనుకున్న మేర వసూళ్లు కూడా రాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా ఈ సినిమా ఫెయిల్యూర్‌పై చిత్ర యూనిట్ ఇప్పటివకు ఎవరూ స్పందించలేదు. కానీ.. తాజాగా ఈ సినిమాలో నటించిన అందాల భామ పూజా హెగ్డే రాధేశ్యామ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడింది. ఈ సినిమాలోని కంటెంట్ చాలా విభిన్నమైనదని.. అది కామన్ ఆడియెన్స్‌కు కనెక్ట్ కాలేకపోయిందని ఆమె చెప్పుకొచ్చింది.

ఇలా ఓ మంచి రొమాంటిక్ చిత్రం ప్రేక్షకులను మెప్పించకపోవడం అంతా విధి రాత అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. రాధేశ్యామ్ సినిమా కోసం తామందరం చాలా కష్టపడ్డామని, అయినా కూడా ఈ సినిమా ప్రేక్షకులను కనెక్ట్ కాకపోవడం తమ దురదృష్టమని ఆమె పేర్కొంది. ఏదేమైనా ఇప్పుడు ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ హీరో విజయ్ దళపతి సరసన బీస్ట్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Share post:

Latest