ఆర్ఆర్ఆర్‌లో తారక్ ఎంట్రీ లేటు.. మండిపడుతున్న ఫ్యాన్స్!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా, హీరోలిద్దరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో హీరోల పాత్రల ఎంట్రీ గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో తొలుత రామరాజు పాత్ర ఎంట్రీ ఇస్తుందని, ఆ తరువాత తారక్ పాత్ర ఎంట్రీ ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. అయితే తారక్ పాత్ర ఎంట్రీ లేటుగా ఉన్నా, అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట.

మొత్తానికి ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్ పాత్ర ఎంట్రీపై వస్తున్న వార్తలతో ఆయన అభిమానులు మండిపడుతున్నారు. తారక్ పాత్ర ఎంట్రీ ఎందుకు ఆలస్యం అవుతుందా.. డైరెక్టర్ ఎందుకు అలా ప్లాన్ చేశాడా అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే జక్కన్న మాత్రం తారక్ అభిమానులు కాలర్ ఎగరేసేలా ఆయన పాత్రను డిజైన్ చేశాడని, అందుకే దానకి తగ్గట్టుగానే ఆయన ఎంట్రీ కూడా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. మరి ఆర్ఆర్ఆర్ సినిమా మొదలయ్యాక ఎంతసేపటికి తారక్ వెండితెరపై కనిపిస్తాడనేది తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Popular