#NBK107 లో మరో సెన్సేషనల్ స్టార్..కేకపెట్టిస్తున్న ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి లుక్..!!

చాలా సంవత్సరాల తరువాత అఖండ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. బోయపాటి డైరెక్షన్ బాలయ్య అఘోరగా నటించిన సినిమా అఖండ. మంచి ఆకలి మీద ఉన్న అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టాడు బాలయ్య ఈ సినిమాతో. ఈ మధ్య నే అఖండ సినిమా 100రోజుల ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు టీం.

కాగా, ప్రజెంట్ బాలయ్య గోఫీచంద్ మల్లినేని డైరెక్షన్ లో..ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఈ సినిమా తెరకెక్కుతుండటంతో అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా బాలయ్యను ఎప్పుడు చూడని విధంగా #NBK107 లో చూయించబోతున్నారట గోపీ. ఇప్పటికే ఈ సినిమా నుండి బాలయ్య ఫస్ట్ పిక్ ని రిలీజ్ చేయగా..అందులో బాలయ్య అంచ్చం వేటాడే సింహం లానే ఉన్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే, కొద్దిసేపటి క్రితమే చిత్ర బృందం ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో బాలయ్య ను ఢీ కొట్టే పాత్రలో నటించబోతున్న శాండల్ వుడ్ సెన్సేషన్ కన్నడ స్టార్ లుక్ ను రివీల్ చేశారు. #NBK107 నుంచి ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి అంటూ దునియా విజయ్ రోల్ ను రివీల్ చేశారు చిత్ర బృందం. ఇక ఈ లుక్ అభిమానులను సినిమా పై మరిన్ని అంచనాలను పెట్టుకునేలా చేసింది. విజయ్ లుక్ ను చూసిన నందమూరి అభిమానులు ఆయనను తెగ పోగిడేస్తున్నారు . బాలయ్య పక్కన విలన్ అంటే ఈ మాత్రం పొగరు ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోకు తగిన విలన్ దొరికాడు అంటూ సంతోష పడిపోతూ..సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు. సినీ విశ్లేషకులు సైతం విజయ్ లుక్ పై మాస్ అండ్ రస్టిక్ మేకోవర్ లో విజయ్ లుక్ అదిరిపోయింది..అంటూ పొగిడేస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్య ఖాతాలో మరో హిట్ పక్కా అని హింట్ వచ్చేసింది.

Share post:

Popular