RRR కోసం ఎన్టీఆర్-చరణ్ ఎన్ని త్యాగాలు చేశారో తెలుసా..!

రాజమౌళి తో సినిమా అంటే పెద్ద తలనొప్పులతో కూడుకున్న వ్యవహారం అని అందరికి తెలిసిందే. ఆయన అడిగిన్నని డేట్లు ఇవ్వాలి..సినిమాకి పనిచేసే ప్రతి ఒక్క మెంబర్ ఐడి కార్డ్ ధరించాల్సిందే ..అది ప్రోడక్షన్ బాయ్ అయినా..స్టార్ హీరో అయినా సరే..అంతేందుకు రాజమౌళీ కూడా ఐడి కార్డ్ వేసుకునే ఉంటాడట షూటింగ్ టైంలో . అంత స్ట్రీక్ట్ గా రూల్స్ ని పెట్టుకుంటాడు పాటిస్తాడు..ఫాలో అయ్యేలా చేస్తాడు. షూటింగ్ టైం అంటే ఖచ్చితంగా చెప్పిన టైంకి అక్కడి ఉండాలి..లేదంటే రాజమౌళి టార్చర్ మరోలా ఉంటుందట. వేసిన స్టెప్స్ నే 10 సార్లు ప్రాక్టీస్ చేయించి రివేంజ్ తీర్చుకుంటాడు అంటారు అందరు.

ఇక ఈ విషయం అందరికి తెలిసిందే..రాజమౌళి తో సినిమా అంటే ..ఆ హీరో లు వేరే సినిమాలో నటించకూడదు ఆయన సినిమా కంప్లీట్ అయ్యేవరకు. జనరల్ గా జక్కన్న సినిమా అంటే మూడేళ్ళు రకంపల్సరీ ..ఇంకా ఎక్కువ కూడా ఉండచ్చు . ఈలోపు ఆ హీరో ఇక్కడ ఇచ్చే దానిమీద ట్రిపుల్ రెమ్యూనరేషన్ అందుకోవచ్చు..ఆ టైం గ్యాప్ లో మరో సినిమాలకు కమిట్ అయితే. అలా ఉంటాది పరిస్ధితి. ప్రజెంట్ ఆయన డైరెక్ట్ చేసిన..RR కూడా దాదాపు మూడేళ్లకు పైగానే షూట్ చేశారు. దీంతో చరణ్-తారక్..ఈ సినిమా వల్ల చాలా డబ్బు నష్టపోయారు అని తెలుస్తుంది.

ఇక ఈ విషయమే రాజమౌళి కూడా స్వయంగా ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ..”ఈ సినిమా కోసం ప్రతి ఒక్క టెక్నిషీయన్..ప్రోడక్షన్ బాయ్, హీరోలు, కెమారా మెన్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ అందరూ కష్టపడ్డారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్-చరణ్ చేసిన త్యాగాలు మర్చిపోలేనివి. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయుండాలి ..కానీ, కరోనా..లాక్ డౌన్..ఇతర ఇతర సమస్యల వల్ల చాలా టైం వేస్ట్ అయ్యింది. దీంతో దాదాపు చరణ్-తారక్ నాలుగేళ్ళు ఈ ప్రాజెక్ట్ లో ఉండిపోయారు. ఈ టైంలో వారిద్దరూ వేరే సినిమాలు చేసుకుంటే ఖచ్చితంగా బాగా డబ్బులు సంపాదించుకునేవారు. కానీ వాళ్ళు ఆర్ఆర్ఆర్ కోసం ఆగారు. మంచి మంచి ఆఫర్స్ ని వదులుకున్నారు. సినిమా స్టార్ట్ అయినా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకూ ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న టాక్ ప్రకారం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం పక్క అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka – CEO – C Space